లేటెస్ట్..రజినీతో ఫస్ట్ టైం హీరోయిన్ గా ఈ స్టార్ బ్యూటీ.!

Published on Aug 13, 2022 9:00 am IST

ప్రస్తుతం ఇండియాస్ బిగ్గెస్ట్ సూపర్ స్టార్ రజినీకాంత్ హీరోగా తమిళ స్టార్ దర్శకుడు నెల్సన్ దిలీపు కుమార్ తో ఓ భారీ సినిమా చేస్తున్న సంగతి అందరికీ తెలిసిందే. “జైలర్” టైటిల్ ప్రీ లుక్ తో అదరగొట్టిన ఈ సినిమాపై ఇప్పుడు మంచి హైప్ ఉంది. ఇక తమిళ్ సహా హైదరాబాద్ లో శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రం నుంచి ఎప్పటికప్పుడు ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ వస్తూనే ఉన్నాయి.

ఇక ఇప్పుడు ఈ సినిమాపై అయితే సాలిడ్ అప్డేట్ బయటకి వచ్చింది. ఈ చిత్రంలో హీరోయిన్ గా టాలెంటెడ్ బ్యూటీ స్టార్ హీరోయిన్ తమన్నా ఫిక్స్ అయ్యినట్టుగా సినీ వర్గాలు చెబుతున్నాయి. దీనితో రజినీతో మొదటి సారి హీరోయిన్ నటించే అవకాశాన్ని ఈమె దక్కించుకున్నట్టు అయ్యింది. ప్రస్తుతం తమిళ్ సహా తెలుగు సినీ వర్గాల్లో ఇదే టాక్ వైరల్ గా మారింది. ఇక ఈ చిత్రానికి అనిరుద్ సంగీతం అందిస్తున్నాడు. అలాగే సన్ పిక్చర్స్ వారు నిర్మాణం వహిస్తున్నారు.

సంబంధిత సమాచారం :