‘ఫౌజీ’ ఫ్లాష్‌బ్యాక్‌లో సాలిడ్ సర్‌ప్రైజ్..?

‘ఫౌజీ’ ఫ్లాష్‌బ్యాక్‌లో సాలిడ్ సర్‌ప్రైజ్..?

Published on Feb 2, 2025 2:00 AM IST

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ చిత్రాల్లో ‘ది రాజా సాబ్’తో పాటు దర్శకుడు హను రాఘవపూడి డైరెక్షన్‌లో తెరకెక్కుతున్న ‘ఫౌజీ’ కూడా ఒకటి. ఈ సినిమాను డైరెక్టర్ పూర్తి పీరియాడిక్ వార్ అండ్ రొమాంటిక్ మూవీగా తీర్చిదిద్దుతున్నారు. ఇక ఈ సినిమాను అత్యంత భారీ బడ్జెట్‌తో రూపొందిస్తున్నారు. అయితే, ఈ సినిమాలో ప్రభాస్ ఎలాంటి పాత్రలో కనిపిస్తాడా అనేది ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది.

సినీ సర్కిల్స్ ప్రకారం ఈ సినిమాలో ప్రభాస్ బ్రాహ్మణ యువకుడిగా.. సైనికుడిగా కనిపిస్తాడట. ఇక ఆయన సరసన యంగ్ బ్యూటీ ఇమాన్వి హీరోయిన్‌గా నటిస్తోంది. అయితే, ఈ సినిమాలో ఓ కీలక ఫ్లాష్‌బ్యాక్ ఎపిసోడ్ ఉంటుందని.. ఈ ఫ్లాష్‌బ్యాక్ ఎపిసోడ్‌లో ఓ స్టార్ బ్యూటీ కనిపించనుందనే టాక్ వినిపిస్తుంది. దీంతో ఇప్పుడు ఈ చిత్ర ఫ్లాష్‌బ్యాక్ ఎపిసోడ్‌పై ప్రేక్షకుల్లో సాలిడ్ అంచనాలు క్రియేట్ అవుతున్నాయి.

మరి ఈ నిజంగానే ఈ మూవీలో ఫ్లా్ష్‌బ్యాక్ ఎపిసోడ్ ఉందా.. ఉంటే, అందులో సర్‌ప్రైజ్ చేసే ఆ స్టార్ ఎవరా.. అనేది తెలియాల్సి ఉంది. ఇక ఈ సినిమాకు విశాల్ చంద్రశేఖర్ సంగీతం అందిస్తుండగా మైత్రీ మూవీ మేకర్స్ ఈ చిత్రాన్ని ప్రొడ్యూస్ చేస్తున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు