Sharwa 38: ఈసారి రక్తపాతంతో రాబోతున్న శర్వానంద్..

Sharwa 38: ఈసారి రక్తపాతంతో రాబోతున్న శర్వానంద్..

Published on Sep 19, 2024 11:08 AM IST

మన టాలీవుడ్ టాలెంటెడ్ హీరోస్ లో ఒకరైన ఛార్మింగ్ స్టార్ శర్వానంద్ హీరోగా నటించిన రీసెంట్ చిత్రం “మనమే” తో పలకరించిన సంగతి తెలిసిందే. అయితే ఈ చిత్రం తర్వాత శర్వానంద్ నుంచి మరిన్ని చిత్రాలు రాబోతుండగా ఇన్ని రోజులు చాలా వరకు క్లాస్ గానే కనిపించిన శర్వా ఈసారి మాత్రం రక్తపాతంలో కనిపించనున్నట్టుగా ఇప్పుడు కన్ఫర్మ్ అయ్యింది.

మన టాలీవుడ్ లో ఉన్నటువంటి మాస్ దర్శకుడు సంపత్ నంది కాంబినేషన్ లో ఇపుడు సాలిడ్ అప్డేట్ ని మేకర్స్ అందించారు. శర్వానంద్ కెరీర్ లో 38వ సినిమాగా అది కూడా ఒక వైలెన్స్ బ్లడ్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కించనున్న సినిమాలో శర్వానంద్ కనిపించనున్నాడు. ఇక ఈ చిత్రానికి భీమ్స్ సంగీతం అందిస్తుండగా శ్రీ సత్య సాయి ఆర్ట్స్ వారు నిర్మాణం వహిస్తున్నట్టుగా ఇప్పుడు తెలిపారు. మరి కంప్లీట్ మాస్ లో ఛార్మింగ్ స్టార్ ఎలాంటి ట్రీట్ ని అందిస్తాడో చూడాలి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు