సిద్ధార్థ్ “చిన్నా” కి సపోర్ట్ గా టాలీవుడ్ యంగ్ హీరో

మన తెలుగు ఇండస్ట్రీకి ఎప్పటి నుంచో సుపరిచితుడు అయినటువంటి తమిళ యంగ్ హీరో సిద్ధార్థ్ హీరోగా నటించిన రీసెంట్ చిత్రం “చిన్నా” విషయంలో రీసెంట్ గా కంటతడి పెట్టుకున్న సంగతి తెలిసిందే. మెయిన్ గా తెలుగు రిలీజ్ విషయంలో సిద్ధార్థ్ తనకి ఎదురైనా చేదు అనుభవాన్ని అయితే తెలియజేసాడు.

తాను ఒక మంచి సినిమా చేశాను అని ఇది ఖచ్చితంగా తెలుగు ఆడియెన్స్ కి కూడా నచ్చుతుంది. ఒకవేళ నచ్చకపోతే మళ్ళీ ఇక్కడికి రాను అని కూడా చెప్పేసాడు. మరి ఈ చిత్రం విడుదల అయ్యి డీసెంట్ టాక్ ని తెచ్చుకుంది కానీ వసూళ్ల పరంగా ఇంకా మెరుగ్గా పెర్ఫామ్ చేయాల్సింది.

అయితే ఇపుడు ఈ చిత్రానికి సపోర్ట్ చేస్తూ యంగ్ హీరో మాస్ కా దాస్ విశ్వక్ సేన్ ముందుకొచ్చాడు. తన తరపు నుంచి ఈ చిత్రాన్ని ఒక 500 మందికి చూపిస్తున్నట్టుగా ఇప్పుడు తెలుస్తుంది. రీసెంట్ గానే ఈ ఇద్దరు కలిసి ఓ ఇంటర్వ్యూ కూడా చేయగా అందులో ఈ అంశం ఉన్నట్టుగా తెలుస్తుంది. దీనితో ఈ మేటర్ ఇపుడు ఫ్యాన్స్ లో ఆసక్తిగా మారింది.

Exit mobile version