“వకీల్ సాబ్” నుంచి ఈ ట్రీట్ కూడా రెడీ అవుతుంది.!

Published on May 18, 2021 2:39 pm IST


పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా శృతి హాసన్ హీరోయిన్ గా నటించిన లేటెస్ట్ అండ్ మోస్ట్ అవైటెడ్ చిత్రం “వకీల్ సాబ్”. దర్శకుడు వేణు శ్రీరామ్ తెరకెక్కించిన ఈ చిత్రం పవన్ కెరీర్ లో మరో భారీ హిట్ గా నిలిచింది. చాలా కాలం నిరీక్షణ అనంతరం మేకర్స్ గత నెల ఈ చిత్రాన్ని విడుదల చేశారు.

ఇక ఇదిలా ఉండగా ఈ చిత్రంతో పవన్ ఫ్యాన్స్ కు మాంచి ట్రీట్ ఇచ్చిన మేకర్స్ ఇప్పుడు మరో మోస్ట్ అవైటెడ్ ట్రీట్ ఇవ్వనున్నట్టుగా తెలుపుతున్నారు. ఈ చిత్రం విజయంలో కీలక పాత్ర పోషించిన వారిలో సంగీత దర్శకుడు థమన్ కూడా ముఖ్యుడు. ఫస్ట్ షాట్ నుంచి ఎండింగ్ వరకు సాంగ్స్ తో పాటుగా అదిరే బ్యాక్గ్రౌండ్ స్కోర్ తో సినిమాను ఓ హై కి లేపాడు థమన్.

మరి తొందరలోనే థమన్ ఈ సినిమా తాలూకా ఒరిజినల్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ ను విడుదల చెయ్యనున్నట్టు కన్ఫర్మ్ చేశారు. ఆలాగే ఈ ఓ ఎస్ టి కోసం మ్యూజిక్ లవర్స్ కూడా గత కొంత కాలం నుంచి ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. మరి ఇది ఎప్పుడు విడుదల చేస్తారో చూడాలి. అలాగే ఈ చిత్రాన్ని దిల్ రాజు నిర్మాణం వహించిన సంగతి తెలిసిందే.

సంబంధిత సమాచారం :