లేటెస్ట్..”సైంధవ్” లో కీలక పాత్రకి వెర్సటైల్ నటి.!

లేటెస్ట్..”సైంధవ్” లో కీలక పాత్రకి వెర్సటైల్ నటి.!

Published on Apr 28, 2023 11:09 AM IST

Saindhav 2

సీనియర్ స్టార్ హీరో విక్టరీ వెంకటేష్ హీరోగా నటిస్తున్న లేటెస్ట్ భారీ పాన్ ఇండియా సినిమా “సైంధవ్” కోసం అందరికీ తెలిసిందే. యంగ్ అండ్ టాలెంటెడ్ దర్శకుడు శైలేష్ కొలను తెరకెక్కిస్తున్న ఈ చిత్రం ఫస్ట్ గ్లింప్స్ తోనే మంచి హైప్ ని నెలకొల్పుకోగా ఇప్పుడు షూటింగ్ కూడా ఫుల్ స్వింగ్ లో పక్కా ప్లానింగ్ ప్రకారం చేసేస్తున్నారు.

ఇక మరో పక్క ఈ సినిమాలో నటిస్తున్న కీలక నటులపై కూడా ఎప్పటికప్పుడు అధికారిక అప్డేట్స్ ని ఇస్తున్న మేకర్స్ లేటెస్ట్ గా మరో అనౌన్స్ మెంట్ అయితే ఇచ్చారు. ఈ సినిమాలో కోలీవుడ్ వెర్సటైల్ నటి ఆండ్రియా జెరెమియా అయితే ఓ కీలక పాత్రలో నటిస్తున్నట్టుగా అనౌన్స్ చేశారు. మరి ఆమెని జాస్మిన్ గా పరిచయం చేసి ఇంటెన్స్ ఫస్ట్ లుక్ కూడా వదిలారు. ఇక ఈ చిత్రానికి సంతోష్ నారాయణన్ సంగీతం అందిస్తుండగా నిహారిక ఎంటర్టైన్మెంట్స్ వారు భారీ బడ్జెట్ తో నిర్మాణం వహిస్తున్నారు.

తాజా వార్తలు

వీక్షకులు మెచ్చిన వార్తలు