టాక్..”అవతార్ 2″ ఫ్రీ స్ట్రీమింగ్ డేట్.!

Published on Mar 29, 2023 10:00 am IST

గత ఏడాది వరల్డ్ బాక్సాఫీస్ ని అయితే షేక్ చేసిన సినిమా ఏదన్నా ఉంది అంటే దాదాపు పదమూడేళ్ల నిరీక్షణ అనంతరం వచ్చిన భారీ సినిమా “అవతార్ 2” అనే చెప్పాలి. సెన్సేషనల్ ఫిలిం మేకర్ జేమ్స్ కేమరూన్ తెరకెక్కించిన అవతార్ కి సీక్వెల్ గా “అవతార్ ది వే ఆఫ్ వాటర్” గా ఈ సినిమా భారీ రిలీజ్ కాగా వరల్డ్ వైడ్ 2 బిలియన్ కి పైగా వసూళ్లు సాధించింది.

ఇక లేటెస్ట్ గానే ఓటిటి లో కూడా రిలీజ్ అయ్యిన ఈ సినిమా ప్రస్తుతానికి అయితే రెంటల్ గా మాత్రమే అందుబాటులో ఉంది. మరి ఫ్రీ స్ట్రీమింగ్ కోసం కూడా చాలా మంది ఆసక్తిగా ఎదురు చూస్తుండగా దీనిపై అయితే లేటెస్ట్ టాక్ తెలుస్తుంది. ఈ సినిమా అఫీషియల్ స్ట్రీమింగ్ హక్కులు అయితే డిస్నీ + హాట్ స్టార్ లో ఉన్న సంగతి తెలిసిందే. మరి ఇందులో ఈ చిత్రం ఈ వచ్చే ఏప్రిల్ 28 నుంచి స్ట్రీమింగ్ కి రానున్నట్టుగా తెలుస్తుంది. ఇక దీనిపై అధికారిక క్లారిటీ రావాల్సి ఉంది.

సంబంధిత సమాచారం :