“గేమ్ ఛేంజర్” సంక్రాంతికి రూమర్స్ కారణమిదే!?

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరోగా మావెరిక్ దర్శకుడు శంకర్ కాంబినేషన్ లో చేస్తున్న భారీ పాన్ ఇండియా చిత్రం “గేమ్ ఛేంజర్” కోసం అందరికీ తెలిసిందే. మరి ఎన్నో అంచనాలు సెట్ చేసుకున్న ఈ చిత్రం భారీ హైప్ ని సెట్ చేసుకొని ఒకో అప్డేట్ తో రాబోతుంది. ఇక ఈ చిత్రం కోసం మెగా అభిమానులు ఓ రేంజ్ లో ఎదురు చూస్తున్నారు.

అయితే గత కొన్ని రోజులు నుంచి ఈ సినిమా రిలీజ్ డిసెంబర్ నుంచి జనవరి సంక్రాంతికి షిఫ్ట్ అవుతుంది అని స్ట్రాంగ్ రూమర్స్ వినిపిస్తున్నాయి. కానీ మేకర్స్ లో థమన్ గని దిల్ రాజు గాని క్రిస్మస్ రిలీజ్ అంటూ చెబుతున్నారు. అయితే వీళ్లు ఇలా చెబుతున్నప్పటికీ గేమ్ ఛేంజర్ సంక్రాంతికి షిఫ్ట్ అయ్యేందుకు ఉన్న ఛాన్స్ ఏంటి అనేది తెలుస్తుంది.

మేకర్స్ సైడ్ నుంచి క్రిస్మస్ డేట్ ని అనుకునే తెలుగు స్టేట్స్ లో దాదాపు డిస్ట్రిబ్యూటర్లు సంక్రాంతికి అయితే బెటర్ అని అంటున్నారట. ఇందుకే ప్రస్తుతానికి గేమ్ ఛేంజర్ రిలీజ్ డేట్ ఇరకాటంలో ఉంది. మేకర్స్ నుంచి ఒక సాలిడ్ అప్డేట్ దీనిపై వస్తే తప్ప రిలీజ్ ఎప్పుడు అనేది ఒక క్లారిటీ రాదు.

Exit mobile version