“RRR”కి అనిరుద్ రవి చందర్ ఎందుకో క్లారిటీ..!

“RRR”కి అనిరుద్ రవి చందర్ ఎందుకో క్లారిటీ..!

Published on Jul 24, 2021 1:50 AM IST


మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ మరియు యంగ్ టైగర్ ఎన్టీఆర్ లతో దర్శక దిగ్గజం రాజమౌళి “రౌద్రం రణం రుధిరం”. అనే సెన్సేషనల్ పాన్ ఇండియన్ ప్రాజెక్ట్ చేస్తున్న సంగతి అందరికీ తెలిసిందే. భారీ అంచనాలను నెలకొల్పుకున్నా ఈ చిత్రం ఇప్పుడు శరవేగంగా ఫైనల్ మెరుగులు దిద్దుకుంటుంది.

అలాగే మరోపక్క ఈ సినిమా మ్యూజిక్ ఆల్బమ్ పై కూడా పలు ఆసక్తికర సమాచారాలే బయటకి వస్తున్నాయి. ప్రస్తుతం అయితే ప్రమోషనల్ సాంగ్ కి జరుగుతుండగా ప్రముఖ స్టార్ సంగీత దర్శకుడు అనిరుద్ ఈ సినిమా ప్రమోషనల్ సాంగ్ కి సంథింగ్ వర్క్ చేస్తున్నాడని ఊహాగానాలు వినిపించాయి.

అయితే ఇప్పుడు కాస్త క్లారిటీ బజ్ వినిపిస్తుంది. ఈ చిత్రంలో అనిరుద్ ఒక అద్భుతమైన పాటను ఆలపించినట్టు తెలుస్తుంది. మరి ఇందులో ఎంత వరకు నిజముందో తెలియాలి. ఇప్పటికే కీరవాణి ఆల్బమ్ పై అంచనాలు పీక్స్ లో ఉన్నాయి. ఆఫ్టర్ బాహుబలి ఇదెలా ఉంటుందో చూడాలి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు