“గేమ్ ఛేంజర్” రిలీజ్ పై అప్పటికి తుది క్లారిటీ!?

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరోగా కియార అద్వానీ అలాగే అంజలి హీరోయిన్స్ గా దర్శకుడు శంకర్ తెరకెక్కించిన భారీ చిత్రమే “గేమ్ ఛేంజర్”. మరి ఎన్నో అంచనాలు సెట్ చేసుకున్న ఈ సినిమా కోసం ఫ్యాన్స్ అంతా చాలా ఏళ్ల నుంచి ఆకలితో ఎదురు చూస్తున్నారు. ఇక ఫైనల్ గా ఇప్పుడు వరుస అప్డేట్స్ వస్తుండడంతో వారంతా ఫుల్ ఖుషీగా ఉన్నారు.

ఇక ఈ సినిమా రిలీజ్ ని ఆల్రెడీ డిసెంబర్ కి ఫిక్స్ చేసేసిన సంగతి తెలిసిందే. అయితే ఈ రిలీజ్ పై తుది క్లారిటీ మాత్రం రానున్న టీజర్ తో ఉంటుంది అని తెలుస్తోంది. అప్పటికి వచ్చే సినిమా ఔట్ ఫుట్ ని బట్టి సినిమా డిసెంబర్ క్రిస్మస్ బరిలో ఉంచాలా లేక సంక్రాంతికి విడుదల చెయ్యాలా అనేది డిసైడ్ చేయనున్నారట. మరి దీనిపై మరింత క్లారిటీ రావాల్సి ఉంది.

Exit mobile version