నందమూరి నటసింహం నందమూరి బాలకృష్ణ హీరోగా నటించిన లేటెస్ట్ సినిమా “డాకు మహరాజ్” కోసం తెలిసిందే. బాలయ్య కెరీర్ లో మరో భారీ హిట్ గా నిలిచింది. ఇక ఈ సినిమా తర్వాత కూడా బాలయ్య నుంచి క్రేజీ లైనప్ ఉండగా ఇందులో తన కంబ్యాక్ దర్శకుడు బోయపాటి శ్రీనుతో చేస్తున్న అవైటెడ్ సీక్వెల్ చిత్రం “అఖండ 2 తాండవం” కూడా ఒకటి. మరి ఈ సినిమా పట్ల యూనానిమాస్ గా సాలిడ్ హైప్ నెలకొంది.
ఇక ఆల్రెడీ శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రంలో బాలయ్య లుక్ అదిరే లెవెల్లో ఉంటుంది అని టాక్ వచ్చింది. ఇక ఈ సినిమా ఫస్ట్ లుక్ పై ఇపుడు మరో టాక్ వినిపిస్తుంది. దీనితో అఖండ 2 ఫస్ట్ లుక్ కి మహాశివరాత్రి కానుకగా వచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఆల్రెడీ బాలయ్యపై బోయపాటి మంచి పవర్ఫుల్ లుక్ ని సిద్ధం చేయగా అది శివరాత్రి కానుకగా రివీల్ చేయనున్నట్లు తెలుస్తోంది. మరి దీనిపై అధికారిక ప్రకటన ఇంకా రావాల్సి ఉంది.