బన్నీ, త్రివిక్రమ్ భారీ ప్రాజెక్ట్ మొదలయ్యేది అప్పుడే!

బన్నీ, త్రివిక్రమ్ భారీ ప్రాజెక్ట్ మొదలయ్యేది అప్పుడే!

Published on Apr 1, 2025 2:00 PM IST

ప్రస్తుతం పాన్ ఇండియా హిట్ పుష్ప 2 చిత్రం తర్వాత ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తన నెక్స్ట్ సినిమా కోసం సిద్ధం అవుతున్న సంగతి తెలిసిందే. అయితే ఈ చిత్రం ఆల్రెడీ మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ తో స్టార్ట్ కావాల్సి ఉంది కానీ అది ఇంకా మొదలు కాలేదు. అయితే దీని ప్లేస్ లో దర్శకుడు అట్లీతో భారీ సినిమా ఉంటుంది అని పలు రూమర్స్ ఆల్రెడీ ఉన్నాయి.

ఇంకోపక్క ఇండియన్ సినిమా దగ్గర ఏ హీరో కానీ దర్శకుడు కానీ టచ్ చెయ్యని ఒక ఫాంటసీ సబ్జెక్టుని బన్నీ, త్రివిక్రమ్ లు తెస్తున్నట్టుగా టాక్ ఉంది. ఇక ఈ సినిమా ఎపుడు మొదలు కానుంది అనే దానిపై ఇపుడు లేటెస్ట్ అప్డేట్ బయటకి వచ్చింది. దీని ప్రకారం ఈ కాంబినేషన్ లో సినిమా ఈ ఏడాది అక్టోబర్ నుంచి షూటింగ్ మొదలు పెట్టుకుంటుంది అని నిర్మాత నాగ వంశీ కన్ఫర్మ్ చేశారు. లేటెస్ట్ గా పెట్టిన మ్యాడ్ స్క్వేర్ ప్రెస్ మీట్ లో ఈ సాలిడ్ అప్డేట్ అందించడం విశేషం. సో ఈ అవైటెడ్ సినిమా ఎట్టకేలకి అప్పటి నుంచి మొదలు కానుంది అని చెప్పాలి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు