“అర్జున్ రెడ్డి” ఫుల్ వెర్షన్ ఎప్పుడో కన్ఫర్మ్ చేసిన విజయ్, సందీప్

“అర్జున్ రెడ్డి” ఫుల్ వెర్షన్ ఎప్పుడో కన్ఫర్మ్ చేసిన విజయ్, సందీప్

Published on Aug 25, 2024 9:06 PM IST


టాలీవుడ్ లో పలు గేమ్ ఛేంజింగ్ సినిమాల్లో సెన్సేషనల్ హిట్ చిత్రం “అర్జున్ రెడ్డి” కూడా ఒకటి. యంగ్ హీరో విజయ్ దేవరకొండ హీరోగా దర్శకుడు సందీప్ రెడ్డి వంగ కాంబినేషన్ లో వచ్చిన ఈ చిత్రం భారీ హిట్ అయ్యి తెలుగు సినిమాలో ఒక కొత్త రకపు ఫీస్ట్ ని ఆడియెన్స్ కి ఇచ్చి ఒక కల్ట్ క్లాసిక్ గా నిలిచిపోయింది. అంతే కాకుండా హిందీ, తమిళ్ లో కూడా రీమేక్ అయ్యి అక్కడా వసూళ్ల వర్షాన్ని కురిపించింది.

అయితే ఈ చిత్రం రిలీజ్ అయ్యి నేటికి ఏడేళ్లు పూర్తయ్యింది. కానీ ఈ సినిమా విడుదల అయ్యిన అప్పుడు ఫీల్ ఇంకా పోలేదు అంటుంటారు ఈ సినిమా అభిమానులు మరి ఈ చిత్రం విషయంలో అప్పట్లోనే అన్ కట్ వెర్షన్ కోసం చాలా మంది ఎదురు చూసారు. కానీ అప్పట్లోనే వస్తుంది అని అనుకున్నారు కానీ అది రాలేదు.

ఈ సినిమా అప్పుడే 3 గంటలు ఉంటే ఒరిజినల్ గా 3 గంటల 40 నిమిషాలకి పైగా ఉన్నట్టుగా టాక్. మరి ఈ ఫుల్ వెర్షన్ ని ఎప్పుడు రిలీజ్ చెయ్యాలో దర్శకుడు హీరో ఇప్పుడు డిసైడ్ చేశారు. అయ్యింది. సినిమా వచ్చి పదేళ్లు పూర్తయినప్పుడు ఫుల్ వెర్షన్ ఇద్దామని విజయ్ దేవరకొండ చెప్పగా అందుకు సందీప్ కూడా ఓకే అంటూ పదో యానివర్సరీకి ఇద్దామని తెలిపారు. సో అర్జున్ రెడ్డి కల్ట్ ఫ్యాన్స్ ఇంకో మూడేళ్లు ఆగాల్సిందే అని చెప్పాలి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు