బాలయ్య “అన్ స్టాప్పబుల్ 2” స్టార్ట్ అయ్యేది అప్పుడేనా.?

నందమూరి బాలకృష్ణ హీరోగా ఇప్పుడు పలు సాలిడ్ సినిమాలు ఓకే చేసిన సంగతి తెలిసిందే. మరి దీనితో పాటుగా బాలయ్య మొదటిసారి హోస్ట్ గా మరి తెలుగు లో ఒక క్రేజీ ఓటిటి టాక్ షో చేశారు. అదే “అన్ స్టాప్పబుల్”. మన తెలుగు స్ట్రీమింగ్ యాప్ ఆహా లో ప్లాన్ చేసిన ఈ షో సూపర్ డూపర్ హిట్ అయ్యింది. దీనితో సీజన్ 2 కోసం చాలా మంది ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు ఇక ఈ సీజన్ పై అయితే ఇంట్రెస్టింగ్ అప్డేట్ ఇప్పుడు వినిపిస్తుంది.

మేకర్స్ అయితే సీజన్ 2 ఫస్ట్ ఎపిసోడ్ ని ఈ దసరా కానుకగా ప్లాన్ చేసే అవకాశం ఉందని తెలుస్తుంది. ఒకవేళ అప్పుడు కాకపోయిన ఈ అక్టోబర్ మొదటి 2 వారాల లోపే ఫస్ట్ ఎపిసోడ్ అందులో స్ట్రీమ్ అయ్యే ఛాన్స్ ఉందట. మరి దీనిపై ఓ అధికారిక అప్డేట్ త్వరలోనే రానుంది. ఇప్పటికే బాలయ్య అభిమానులు చాలా ఆసక్తిగా ఎనర్జిటిక్ బాలయ్యని హోస్ట్ గా చూడాలని ఆసక్తిగా ఉన్నారు.

Exit mobile version