ప్రస్తుతం టాలీవుడ్ నుంచి రాబోతున్న పలు భారీ చిత్రాల్లో యంగ్ హీరో తేజ సజ్జ అలాగే దర్శకుడు ప్రశాంత్ వర్మ కాంబినేషన్ లో తెరకెక్కించిన చిత్రం “హను మాన్” కూడా ఒకటి. మరి టీజర్ నుంచే క్రేజీ హైప్ తెచ్చుకున్న ఈ చిత్రం రీసెంట్ గా ట్రైలర్ తో కూడా ఆకట్టుకుంది. ఇక మేకర్స్ సినిమా ప్రమోషన్స్ ని ముమ్మురం చేయగా ఈ ప్రమోషన్స్ లో అయితే దర్శకుడు ప్రశాంత్ వర్మ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసాడు.
ఈ చిత్రాన్ని తమకున్న బడ్జెట్ లో మంచి క్వాలిటీతో చేశామని తెలిపాడు. సినిమాలో వి ఎఫ్ ఎక్స్ చాలా బాగుంటాయి అని ఈ చిత్రాన్ని బిగ్ స్క్రీన్ పై చూసి ఎంజాయ్ చేయడానికి చేశామని అందుకే థియేటర్స్ లో అంతా తప్పకుండా చూడాలని అన్నాడు. అంతే కాకుండా ఈ సినిమా ఓటిటిలో కూడా అంత త్వరగా రావడం లేదని కన్ఫర్మ్ చేసాడు.
థియేటర్స్ లో రిలీజ్ అయ్యిన 60 రోజుల తర్వాత అంటే రెండు నెలల తర్వాత మాత్రమే వస్తుంది అని తేల్చేసాడు. సో ఈ చిత్రం ఓటిటి రిలీజ్ కోసం చూసేవారికి అయితే తాను ముందుగానే ఓ క్లారిటీ ఇచ్చేసాడు అని చెప్పాలి. మరి ఈ అవైటెడ్ చిత్రం ఎలా ఉంటుందో తెలియాలి అంటే ఈ జనవరి 12 వరకు ఆగి చూస్తే తెలుస్తుంది.