లీక్ అయ్యిన “కల్కి 2898 ఎడి” రెండో ట్రైలర్ అప్పుడేనా!?

లీక్ అయ్యిన “కల్కి 2898 ఎడి” రెండో ట్రైలర్ అప్పుడేనా!?

Published on Jun 16, 2024 9:01 AM IST


రెబల్ స్టార్ ప్రభాస్ (Prabhas) హీరోగా దీపికా, దిశా పటాని (Disaha Patani) సహా దిగ్గజ నటులు కమల్ హాసన్ (Kamal Haasan) అలాగే అమితాబ్ బచ్చన్ లు కలయికలో దర్శకుడు నాగ్ అశ్విన్ తెరకెక్కించిన సెన్సేషనల్ చిత్రం “కల్కి 2898 ఎడి” కోసం అందరికీ తెలిసిందే. అయితే ఈ భారీ చిత్రం పై అప్పటి వరకు ఉన్న అంచనాలు ఒకటి ట్రైలర్ వచ్చాక ఒకటిగా మారాయి అని చెప్పడంలో సందేహం లేదు.

సినిమాలో ఉన్న చాలా సర్ప్రైజ్ లకి జస్ట్ మచ్చు తునకగా మొదటి ట్రైలర్ ని రిలీజ్ చేయగా దానికి సంచలన రెస్పాన్స్ వచ్చింది. అయితే దీనికి ముందు లీక్ అయ్యిన మరో ట్రైలర్ కూడా ఉంది. అయితే దీన్ని వేణు వెంటనే మేకర్స్ సోషల్ మీడియాలో తొలగించారు.

ఇక ఈ ట్రైలర్ అఫీషియల్ గా ఎప్పుడు వస్తుంది అనేది ఇప్పుడు తెలుస్తుంది. లేటెస్ట్ బజ్ ప్రకారం ఈ ట్రైలర్ ఈ జూన్ 23న రాబోతున్నట్టుగా రూమర్స్ వినిపిస్తున్నాయి. మరి దీనిపై అధికారిక క్లారిటీ రావాల్సి ఉంది. ఇక ఈ చిత్రానికి సంతోష్ నారాయణన్ సంగీతం అందిస్తుండగా వైజయంతి మూవీస్ వారు నిర్మాణం వహించారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు