“కన్నప్ప” విడుదల కూడా అప్పుడుకే!?

టాలీవుడ్ డైనమిక్ స్టార్ మంచు విష్ణు హీరోగా ఇప్పుడు చేస్తున్న తన అవైటెడ్ డ్రీం ప్రాజెక్ట్ చిత్రం “కన్నప్ప”. మరి ఈ సినిమా నార్త్ నుంచి సౌత్ వరకు కూడా భారీ తారాగణంతో వస్తుండగా రీసెంట్ గానే సినిమా టీజర్ ని విడుదల చేసుకుంది. మరో టీజర్ కి మంచి రెస్పాన్స్ నే వచ్చింది. అయితే ఈ టీజర్ తర్వాత మరిన్ని అప్డేట్స్ రానుండగా అసలు ఈ సినిమా రిలీజ్ ఎప్పుడు ఏంటి అనే విషయాలపై లేటెస్ట్ బజ్ వినిపిస్తుంది.

విష్ణు ఎన్నో అంచనాలు పెట్టుకున్న ఈ హై బడ్జెట్ సినిమాని ఈ ఏడాదిలోనే రిలీజ్ కి చూస్తున్నారట. అది కూడా డిసెంబర్ రిలీజ్ అన్నట్టుగా ఊహాగానాలు వినిపిస్తున్నాయి. అయితే ఇదే డిసెంబర్ లో చాలా సినిమాలే ఉన్నాయి. అది కూడా పాన్ ఇండియా సినిమాలే ఉన్నాయి.

మరి వాటితో పాటుగా ఈ సినిమా అంటే పోటీ గట్టిగానే ఉండేలా ఉందని చెప్పాలి. మరి దీనిపై మరిన్ని డీటెయిల్స్ ఇంకా రావాల్సి ఉంది. ఇక ఈ చిత్రానికి ముకేశ్ కుమార్ సింగ్ దర్శకత్వం వహిస్తుండగా ప్రభాస్ (Prabhas), కాజల్ (Kajal), అక్షయ్ కుమార్ (Akshay Kumar), మోహన్ లాల్ లాంటి దిగ్గజ నటులు కీలక పాత్రల్లో నటించారు.

Exit mobile version