సూర్య అవైటెడ్ “కంగువ” రిలీజ్ ఎప్పుడంటే!?


కోలీవుడ్ స్టార్ హీరో సూర్య హీరోగా దిశా పటాని హీరోయిన్ గా దర్శకుడు శివ తెరకెక్కిస్తున్న భారీ చిత్రం “కంగువ” కోసం అందరికీ తెలిసిందే. మరి ఈ సినిమాని దర్శకుడు ఒక యూనిక్ కాన్సెప్ట్ తో తీసుకురాబోతుండగా ఇప్పటివరకు అయితే సినిమాపై మంచి బజ్ నెలకొంది. ఇక ఈ భారీ చిత్రం కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తుండగా షూటింగ్ అంతా పూర్తి చేసుకొని ఈ చిత్రం ఇప్పుడు పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో ఉంది.

అయితే అసలు ఈ సినిమా విడుదల ఎప్పుడు అనేది ఎప్పుడు నుంచో ఆసక్తిగా ఉండగా ఒక టైం లో అభిమానులు ట్రోల్స్ తో నిర్మాత ఫైర్ కూడా అయ్యారు. ఇక ఫైనల్ గా ఇప్పుడు అసలు ఈ సినిమా ఎప్పుడు విడుదల అవుతుంది అనే దానిపై లేటెస్ట్ బజ్ వినిపిస్తుంది. దీని ప్రకారం ఈ చిత్రం ఈ ఏడాది డిసెంబర్ 20 కి అలా ప్లాన్ చేసినట్టుగా రూమర్స్ వినిపిస్తున్నాయి.

అయితే సినిమాని దాదాపు డిసెంబర్ లోనే తీసుకొచ్చే ప్రయత్నాలు చేస్తున్నారని డేట్ పై అధికారిక క్లారిటీ మాత్రం మున్ముందు రానుంది అని వినిపిస్తుంది. ఇక ఈ చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తుండగా స్టూడియో గ్రీన్, యూవీ క్రియేషన్స్ వారు భారీ బడ్జెట్ తో నిర్మాణం వహిస్తున్నారు.

Exit mobile version