పాన్ ఇండియా రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా మాళవిక మోహనన్ అలాగే నిధి అగర్వాల్ లు హీరోయిన్స్ గా దర్శకుడు మారుతి తెరకెక్కిస్తున్న భారీ చిత్రం “ది రాజా సాబ్” కోసం అందరకీ తెలిసిందే. అయితే ఈ సినిమా అన్నీ బాగుండి ఉంటే ఈ పాటికే సాలిడ్ ప్రమోషన్స్ లో ఉండి ఉండేది. కానీ రిలీజ్ అయితే వాయిదా పడిన సంగతి తెలిసిందే. ఇక కొత్త డేట్ ఏంటి ఎప్పుడు అనే దానిపై లేటెస్ట్ బజ్ వినిపిస్తోంది.
దీని ప్రకారం ఈ ఉగాదికి గాని లేదా ఏప్రిల్ లో ఇంట్రెస్టింగ్ టీజర్ తో ఆ డేట్ ని మేకర్స్ రివీల్ చేయనున్నట్లు ఇపుడు తెలుస్తోంది. దీనితో ఈ సినిమా ట్రీట్ కోసం చూస్తున్న వారికి అప్పుడు ఒక క్లారిటీ రానుంది అని చెప్పవచ్చు. ఇక ఈ చిత్రానికి థమన్ సంగీతం అందిస్తున్నాడు అలాగే పీపుల్ మీడియా ఫ్యాక్టరీ వారు నిర్మాణం వహిస్తున్న సంగతి తెలిసిందే.