“పుష్ప 3” కి స్టార్ట్ అక్కడా?

“పుష్ప 3” కి స్టార్ట్ అక్కడా?

Published on Feb 6, 2024 2:02 PM IST

పాన్ ఇండియా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా రష్మికా మందన్నా హీరోయిన్ గా మన టాలీవుడ్ క్రియేటివ్ దర్శకుడు సుకుమార్ తెరకెక్కిస్తున్న భారీ పాన్ ఇండియా సీక్వెల్ చిత్రం “పుష్ప 2 ది రూల్” కోసం అందరికీ తెలిసిందే. మరి ఈ చిత్రం షూటింగ్ ఇప్పుడు ఫుల్ స్వింగ్ లో కొనసాగుతూ ఉండగా ఈ చిత్రం షూటింగ్ కి సంబంధించి రీసెంట్ గానే ఓ ఇంట్రెస్టింగ్ టాక్ బయటకి వచ్చింది.

ప్రస్తుతం ఇండియాలో షూట్ అనంతరం జపాన్ కి వెళ్తున్నారని అక్కడ కీలక సన్నివేశాలు చేస్తున్నారని వచ్చింది. అయితే ఇప్పుడు అసలు జపాన్ షూట్ లోనే క్లైమాక్స్ సీన్స్ అన్నట్టుగా రూమర్స్ వినిపిస్తున్నాయి. దీనితో పుష్ప 2 కి ఎండింగ్ అలాగే “పుష్ప 3” కి స్టార్ట్ అక్కడ నుంచి ఉండొబోతుంది అని రూమర్స్ వినిపిస్తున్నాయి.

మరి ఇందులో ఎంతవరకు నిజముందో చూడాలి. ఈ చిత్రానికి మూడో పార్ట్ కూడా ఉందని ఎప్పుడో వచ్చింది. ఇక దీనిని మరింత గ్రాండ్ గా ప్లాన్ చేస్తున్నట్టుగా వీటితో అర్ధం అవుతుంది. మరి పుష్ప పార్ట్ 1 స్టార్టింగ్ లోనే కథ నరేషన్ లో జపాన్ ప్రస్తావన వస్తుంది. మరి సుకుమార్ ఏ లెవెల్లో ప్లాన్ చేసారో వేచి చూడాలి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు