తమిళ్ నుంచి ఉన్న హీరోస్ లో తెలుగులో కూడా మంచి క్రేజ్ ఉన్నటువంటి వారు కొందరు ఉన్నారు. మరి అలాంటి హీరోస్ లో వెర్సటైల్ స్టార్ హీరో సూర్య కూడా ఒకరు. మరి సూర్య హీరోగా ఇప్పుడు తన కెరీర్ లోనే అత్యంత భారీ బడ్జెట్ తో చేస్తున్న సెన్సేషనల్ సినిమా “కంగువా” తో రిలీజ్ కి రాబోతున్నారు.
అయితే ఈ చిత్రాన్ని మొదటిగా దసరా బరిలో అక్టోబర్ 10న రిలీజ్ కి ప్లాన్ చేశారు కానీ ఈ డేట్ ని వాయిదా వేసినట్టు సూర్య తెలిపాడు. మరి కొత్త డేట్ పై పలు ఊహాగానాలు వినిపిస్తున్నాయి. కానీ మేకర్స్ మాత్రం ఇంకా దీనిపై ఎలాంటి క్లారిటీ ఇవ్వడంలేదు. అయితే దీనికి కారణం ఏంటో తెలుస్తుంది. మేకర్స్ పాన్ ఇండియా వైడ్ అన్ని భాషల్లో కలిపి ఒకేసారి రిలీజ్ చేయాలని చూస్తున్నారట.
ఒక భాషలో ఒకసారి మరో భాషలో ఒకసారి కాకుండా మొత్తం పాన్ ఇండియా భాషల్లో ఒకేసారి విడుదల చేయాలని డిసైడ్ అయ్యారట. అందుకే ప్రస్తుతానికి ఎలాంటి క్లారిటీ ఇవ్వడం లేదని తెలుస్తుంది. ప్రస్తుతం అయితే నవంబర్ మధ్యలో రిలీజ్ అంటూ రూమర్స్ ఉన్నాయి. మరి దీనిపై ఏమన్నా క్లారిటీ వస్తుందేమో చూడాలి.