ఆ ఘటనలు ‘గేమ్ ఛేంజర్‌’లో ఉన్నాయి – దిల్ రాజు

దర్శకుడు శంకర్ – రామ్ చరణ్ కాంబినేషన్లో రాబోతున్న సెన్సేషనల్ ప్రాజెక్ట్ ‘గేమ్ ఛేంజర్’. జనవరి 10, 2025న ఈ సినిమా థియేటర్లలోకి రానుంది. ఈ పొలిటికల్ డ్రామా పై మెగా ఫ్యాన్స్ లో ఇప్పటికే భారీగా అంచనాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే ఏ భారతీయ సినిమాకు చేయని విధంగా విదేశాల్లో ప్రీరిలీజ్‌ ఈవెంట్‌ను నిర్వహించారు. ఈ వేదిక పై మాట్లాడిన నిర్మాత దిల్ రాజు ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు.

ఇంతకీ, నిర్మాత దిల్ రాజు ఏం మాట్లాడారు అంటే.. ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో నెలకొన్న అనేక పరిస్థితులు ‘గేమ్ ఛేంజర్’ సినిమాలో కనిపిస్తాయి. మిమ్మల్ని థియేటర్లో ఆ ఇన్సిడెంట్స్ అలరిస్తాయి. కానీ, వాటిని శంకర్ నాలుగేళ్ళ క్రితమే రాసుకున్నారు. అవి మీతో క్లాప్స్ కొట్టిస్తాయి. తెలుగు ప్రేక్షకులకు, దేశవ్యాప్తంగా ఉన్న అన్ని భాషల ప్రేక్షకులకు ఈ సినిమా హై ఓల్టేజీని, కిక్కును ఇస్తుంది’ అంటూ దిల్ రాజు తెలిపారు.

కాగా ఈ సినిమాలో కియారా అద్వానీ కథానాయికగా నటిస్తోంది. మరో కీలక పాత్రలో అంజలి కనిపించనుంది. అన్నట్టు గేమ్ ఛేంజర్ నార్త్ ఇండియా థియేటర్స్ రైట్స్ ను అనిల్ తడాని యొక్క AA ఫిల్మ్స్ సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే.

Exit mobile version