బాలీవుడ్ లోనైనా టాలీవుడ్ లోనైనా సాధారణ రోజుల్లో పెద్ద సినిమాల సందడి ఒకే సమయంలో ఉండదు. కానీ, ఒకేసారి 3 హిందీ పెద్ద సినిమాలు తమ అప్ డేట్స్ తో వార్తల్లో నిలిచాయి. మరి ఆ 3 భారీ సినిమాల పరిస్థితి ఏమిటో చూద్దాం. ఇంతకీ, ఆ సినిమాలేవీ అంటే.. ‘సికందర్’ – ‘జాట్’ – ‘కేసరి చాప్టర్ 2’. ఈ
ఆదివారం నాడు అనగా మార్చి 23న సికందర్ ట్రైలర్ రిలీజ్ కానుంది.
సోమవారం నాడు అనగా మార్చి 24న కేసరి చాప్టర్ 2 టీజర్ రిలీజ్ కానుంది.
సోమవారం నాడు అనగా మార్చి 24న జాట్ ట్రైలర్ రిలీజ్ కానుంది.
పై మూడు సినిమాలకు భారీ బజ్ ఉంది. పైగా ప్రేక్షకుల ఉత్సాహాన్ని తిరిగి రేకెత్తించే చిత్రాలు ఇవి. ప్రేక్షకులను సినిమా థియేటర్లకు తిరిగి తీసుకువచ్చేందుకు ఉపయోగపడే సినిమాలు ఇవి. అందుకే, ఇప్పుడు బాలీవుడ్ బాక్సాఫీస్ ఈ మూడు చిత్రాలపై ఎక్కువగా ఆధారపడింది.
బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ ‘సికందర్’తో ‘ఈద్’ రోజున బాక్సాఫీస్ వద్ద గర్జించబోతున్నాడు. ట్రైలర్ కూడా సినిమా పై అంచనాలను భారీగా పెంచేలా ఉంది. దీనికితోడు సల్మాన్ ఖాన్ నుంచి చాలా గ్యాప్ తర్వాత రాబోతున్న క్రేజీ సినిమా ఇది. అందుకే ఈ సినిమా బాక్సాఫీస్ ను షేక్ చేయడం ఖాయంగా కనిపిస్తోంది.
ఇక మరో బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ ‘కేసరి చాప్టర్ 2’తో తన హవాను చూపించబోతున్నాడు. గుడ్ ఫ్రైడే నాడు ఈ సినిమా రిలీజ్ కాబోతుంది. సినిమా పై భారీ అంచనాలు ఉన్నాయి. పైగా అక్షయ్ కుమార్ ఈ సినిమాలో చాలా కొత్తగా కనిపించబోతున్నాడు.
అన్నట్టు ప్రస్తుతం ఫుల్ ఫామ్ లో ఉన్న ‘సన్నీడియోల్’ ‘బైసాఖి’ రోజున జాట్ తో థియేటర్లలోకి రాబోతున్నాడు. ‘సన్నీడియోల్’ నుంచి రాబోతున్న ఈ మాస్ యాక్షన్ ఎంటర్ టైనర్ పై కూడా భారీగా అంచనాలు ఉన్నాయి. మొత్తానికి మూడు పెద్ద చిత్రాలు… పైగా మూడు ముఖ్యమైన విడుదల తేదీలు రాబోతున్నాయి. మరి వీటిలో ఎన్ని సినిమాలు విజయాన్ని సాధిస్తాయో చూడాలి.
'SIKANDAR' – 'JAAT' – 'KESARI CHAPTER 2': CRUCIAL DAYS AHEAD… The calm before the storm…
⭐️ Sunday, 23 March: #SikandarTrailer
⭐️ Monday, 24 March: #KesariChapter2Teaser
⭐️ Monday, 24 March: #JaatTrailer#Sikandar, #Jaat and #KesariChapter2 – the industry is heavily… pic.twitter.com/W2ou7bu67W— taran adarsh (@taran_adarsh) March 23, 2025