Alia Bhatt: ఆలియా ‘జిగ్రా’ కోసం ముగ్గురు స్టార్స్.. ఎవరంటే?

Alia Bhatt: ఆలియా ‘జిగ్రా’ కోసం ముగ్గురు స్టార్స్.. ఎవరంటే?

Published on Oct 8, 2024 2:07 AM IST

బాలీవుడ్ స్టార్ బ్యూటీ ఆలియా భట్ నటించిన లేటెస్ట్ మూవీ ‘జిగ్రా’ దసరా కానుకగా నేషన్‌వైడ్ రిలీజ్‌కి రెడీ అవుతోంది. ఈ సినిమాతో ఆలియా మరోసారి బ్లాక్‌బస్టర్ హిట్ కొడుతుందని ఆమె అభిమానులు ధీమా వ్యక్తం చేస్తున్నారు. పాన్ ఇండియా మూవీగా ఈ సినిమాను రిలీజ్ చేసేందుకు మేకర్స్ రెడీ అవుతున్నారు.

ఇక ఈ సినిమాలో ఆలియా చేసే యాక్షన్ స్టంట్స్ ప్రేక్షకులను అమితంగా ఆకట్టుకుంటాయని చిత్ర యూనిట్ చెబుతోంది. కాగా, ఈ సినిమాకు సంబంధించిన తెలుగు ప్రమోషన్స్‌కి చిత్ర యూనిట్ పక్కా ప్లానింగ్ చేస్తోంది. ఈ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ని హైదరాబాద్‌లో అక్టోబర్ 8న సాయంత్రం 4 గంటల నుంచి పార్క్ హయత్ హోటల్‌లో నిర్వహించనున్నారు. కాగా, ఈ ఈవెంట్‌కి ముగ్గురు స్టార్ సెలెబ్రిటీలు గెస్టులుగా రానున్నారు.

టాలీవుడ్ హల్క్ రానా దగ్గుబాటి, స్టార్ బ్యూటీ సమంత, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ ఈ చిత్ర ప్రీ-రిలీజ్ ఈవెంట్‌కి హాజరవుతున్నట్లు మేకర్స్ వెల్లడించారు. దీంతో ఈ మూవీ ప్రీ-రిలీజ్ ఈవెంట్‌పై ప్రేక్షకుల్లో ఆసక్తి నెలకొంది. ఇక ఈ సినిమాను దసరా కానుకగా అక్టోబర్ 11న రిలీజ్ చేసేందుకు మేకర్స్ సిద్ధమయ్యారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు