‘థగ్ లైఫ్’ ట్రైలర్‌ను సిద్ధం చేస్తున్న కమల్..?

‘థగ్ లైఫ్’ ట్రైలర్‌ను సిద్ధం చేస్తున్న కమల్..?

Published on Oct 14, 2024 5:54 PM IST

యూనివర్సల్ హీరో కమల్ హాసన్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘థగ్ లైఫ్’ ప్రేక్షకుల్లో మంచి అంచనాలను క్రియేట్ చేసింది. ఈ సినిమాతో కమల్ హాసన్ మరోసారి తనదైన పర్ఫార్మెన్స్‌తో ప్రేక్షకులను ఎంటర్‌టైన్ చేసేందుకు సిద్ధమవుతున్నాడు. ఈ సినిమాను వెర్సటైల్ డైరెక్టర్ మణిరత్నం తెరకెక్కిస్తుండటంతో అంచనాలు రెట్టింపు అయ్యాయి.

ఇక ఇప్పటికే రిలీజ్ అయిన ఈ మూవీ పోస్టర్స్‌కి మంచి రెస్పాన్స్ దక్కింది. అయితే, తన అభిమానుల కోసం ఈ సినిమా నుంచి అదిరిపోయే అప్డేట్ ఇచ్చేందుకు కమల్ అండ్ టీమ్ రెడీ అవుతోంది. ‘థగ్ లైఫ్’ మూవీ ట్రైలర్‌ను ప్రేక్షకులు రిలీజ్ చేసేందుకు చిత్ర యూనిట్ సిద్ధమవుతోంది. కమల్ హాసన్ పుట్టినరోజైన నవంబర్ 7న థగ్ లైఫ్ చిత్ర ట్రైలర్ లాంచ్ చేయాలని వారు చూస్తున్నారు.

దీంతో కమల్ అభిమానులు అదిరిపోయే ట్రీట్‌లా ఇది ఉంటుందని వారు భావిస్తున్నారు. ఈ సినిమాలో శింబు, త్రిష, అశోక్ సెల్వన్, నాజర్, అభిరామి తదితరులు ఇతర ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. ఏఆర్ రెహమాన్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నాడు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు