‘పుష్ప-2’ కోసం టికెట్ రేట్లు భారీగా పెరగనున్నాయా..?

‘పుష్ప-2’ కోసం టికెట్ రేట్లు భారీగా పెరగనున్నాయా..?

Published on Nov 19, 2024 2:59 AM IST


టాలీవుడ్ ప్రెస్టీజియస్ మూవీ ‘పుష్ప-2’ డిసెంబర్ 5న గ్రాండ్ వరల్డ్‌వైడ్ థియేట్రికల్ రిలీజ్‌కు రెడీ అయ్యింది. ఇక తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమాపై నెలకొన్న బజ్ ఎలాంటిదో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అయితే, ఈ సినిమాను భారీ స్థాయిలో రిలీజ్ చేసేందుకు మైత్రీ మూవీ మేకర్స్ అన్ని రకాల ప్రయత్నాలు చేస్తున్నారు. ఇటు తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమా కోసం టికెట్ రేట్లు కూడా భారీగా పెంచేందుకు వారు ప్రయత్నాలు చేస్తున్నట్లుగా సినీ సర్కిల్స్‌లో టాక్ వినిపిస్తోంది.

తెలంగాణలో ఎలాగూ టికెట్ రేట్ల పెంపుకు అనుమతులు లభిస్తాయి. అయితే, ఆంధ్రప్రదేశ్‌లో ఈ సినిమా కోసం ఎంతమేర టికెట్ రేట్ల పెంపు ఉంటుందనేది హాట్ టాపిక్‌గా మారింది. కాగా, ఏపీలో సింగిల్ స్క్రీన్ సాధారణ టికెట్ రేట్లు రూ.150-200 మధ్య ఉంటాయి. ఇప్పుడు ‘పుష్ప-2’ రిలీజ్ సందర్భంగా ఈ రేటును రూ.300 గా పెంచాలని నిర్మాతలు ఏపీ ప్రభుత్వాన్ని కోరనున్నారు. ఎలాగూ బెనిఫిట్ షోలు, ఎక్స్‌ట్రా షోలకు అనుమతి లభిస్తుంది. ఇప్పుడు టికెట్ రేట్ల పెంపుకు కూడా అనుమతి లభిస్తే.. పుష్ప-2 నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్లకు ఇది గుడ్ న్యూస్ అనే చెప్పాలి.

మరి ‘పుష్ప-2’ విషయంలో ఏపీ ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందా అనేది ఆసక్తికరంగా మారింది. సినిమా టికెట్ రేట్లను పెంచుతారా.. లేదా అనేది వేచి చూడాలి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు