సంక్రాంతి సినిమాల టికెట్ రేట్ల పెంపుకు గ్రీన్ సిగ్నల్

సంక్రాంతి సీజన్‌లో రిలీజ్ అవుతున్న సినిమాలపై ప్రేక్షకుల్లో మంచి అంచనాలు క్రియేట్ అయ్యాయి. ఈ పండుగకు మూడు బడా చిత్రాలు పోటీ పడుతున్నాయి. గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ‘గేమ్ ఛేంజర్’.. నందమూరి బాలకృష్ణ ‘డాకు మహారాజ్’.. వెంకటేష్ ‘సంక్రాంతికి వస్తున్నాం’ చిత్రాలు సంక్రాంతి బరిలో నిలిచాయి. ఈ మూడు చిత్రాలు కూడా ప్రేక్షకుల్లో మంచి క్రేజ్‌ను దక్కించుకున్నాయి.

అయితే, ఈ సినిమాలన్నింటికీ కూడా టికెట్ రేట్ల పెంపుకు ఏపీ సర్కార్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. తెలంగాణలో ఇప్పటికే సినిమా టికెట్ రేట్ల పెంపు ఉండబోదని సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించిన సంగతి తెలిసిందే. దీంతో ఏపీలో ఈ చిత్రాల టికెట్ రేట్లు భారీగా పెరగనున్నాయి. గేమ్ ఛేంజర్ చిత్రానికి సింగిల్ స్క్రీన్ థియేటర్లలో రూ.135, మల్టీప్లెక్స్‌లలో రూ.175 మేర టికెట్ రేట్లు పెంచుకునేందుకు అనుమతి లభించింది. ఇక ఈ చిత్రానికి సంబంధించి బెనిఫిట్ షో టికెట్ రేట్లు రూ.600కు పెంచుకునే విధంగా ఉండబోతుంది.

అటు ‘డాకు మహారాజ్’ చిత్రానికి సింగిల్ స్క్రీన్స్‌లో రూ.110, మల్టీప్లెక్స్‌లలో రూ.135 పెంపుకు అనుమతినిచ్చారు. ఈ చిత్ర బెనిఫిట్ షోకు రూ.500 మేర పెంపుకు అనుమతినిచ్చారు. మరో సినిమా ‘సంక్రాంతికి వస్తున్నాం’కి సింగిల్ స్క్రీన్స్‌లో రూ.75, మల్టీప్లెక్స్‌లలో రూ.100 పెంపు ఉండనుంది. మరి ఈ మూడు చిత్రాల్లో ఏ సినిమా ఎలాంటి విజయాన్ని అందుకుని లాంగ్ రన్ కంటిన్యూ చేస్తుందో చూడాలి.

Exit mobile version