మాస్ మహారాజా రవితేజ హీరోగా నుపుర్ సనన్, గాయత్రీ భరద్వాజ్ హీరోయిన్స్ గా యువ దర్శకుడు వంశీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న లేటెస్ట్ భారీ పాన్ ఇండియన్ మాస్ యాక్షన్ మూవీ టైగర్ నాగేశ్వరరావు. ఈ మూవీ అక్టోబర్ 20న గ్రాండ్ గా ఆడియన్స్ ముందుకి రానుంది. జేవీ ప్రకాష్ కుమార్ సంగీతం అందిస్తున్న ఈ మూవీని అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ బ్యానర్ పై అభిషేక్ అగర్వాల్ నిర్మిస్తున్నారు.
ఇక ఇప్పటికే ఈ మూవీ నుండి రిలీజ్ అయిన టీజర్, రెండు సాంగ్స్, ట్రైలర్ అందరినీ ఆకట్టుకోగా అక్టోబర్ 12న మూడవ సాంగ్ ని రిలీజ్ చేయనున్నట్లు మేకర్స్ కొద్దిసేపటి క్రితం ప్రకటించారు. ఇచ్చేసుకుంటాలే అనే పల్లవితో సాగే ఈ సాంగ్ తప్పకుండా ఆడియన్స్ ని అలరిస్తుందని అంటోంది యూనిట్. మరి అందరిలో మంచి అంచనాలు ఏర్పరిచిన టైగర్ నాగేశ్వరరావు రిలీజ్ అనంతరం ఎంత మేర సక్సెస్ సాధిస్తుందో చూడాలి.