“టిల్లు స్క్వేర్” కి బుల్లితెర పై సూపర్ రెస్పాన్స్!

“టిల్లు స్క్వేర్” కి బుల్లితెర పై సూపర్ రెస్పాన్స్!

Published on Aug 22, 2024 7:01 PM IST

టాలీవుడ్ యంగ్ హీరో సిద్ధు జొన్నలగడ్డ ప్రధాన పాత్రలో, దర్శకుడు మల్లిక్ రామ్ దర్శకత్వంలో తెరకెక్కిన టిల్లు స్క్వేర్ చిత్రం థియేటర్ల లో రిలీజ్ అయ్యి ప్రేక్షకులను ఆకట్టుకుంది. బాక్సాఫీస్ వద్ద ఈ చిత్రం బ్లాక్ బస్టర్ గా నిలిచింది. డిజిటల్ ప్రీమియర్ గా కూడా సూపర్ రెస్పాన్స్ ను సొంతం చేసుకున్న ఈ చిత్రం, ఇటీవల వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ గా ప్రముఖ టీవీ ఛానల్ అయిన స్టార్ మా లో ప్రసారం అయ్యింది.

అందుకు సంబంధించిన టీఆర్పీ రేటింగ్ తాజాగా వెలువడింది. ఈ చిత్రానికి 7.93 టీఆర్పీ రేటింగ్ వచ్చింది. ఇది సూపర్ రెస్పాన్స్ అని చెప్పాలి. అనుపమ పరమేశ్వరన్ ఫిమేల్ లీడ్ లో నటించగా, నేహ శెట్టి, ప్రియాంక జవాల్కర్ లు గెస్ట్ రోల్స్ లో నటించారు. సితార ఎంటర్ టైన్మెంట్స్ మరియు ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్లపై ఈ చిత్రాన్ని నిర్మించారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు