సమీక్ష : “టిల్లు స్క్వేర్” – ఎంటర్టైన్ చేసే క్రేజీ సీక్వెల్

Tillu Square Movie Review in Telugu

విడుదల తేదీ : మార్చి 29, 2024

123తెలుగు.కామ్ రేటింగ్ : 3.25/5

నటీనటులు: సిద్ధూ జొన్నలగడ్డ, అనుపమ పరమేశ్వరన్, మురళీ శర్మ, ప్రిన్స్, బ్రహ్మాజీ, మురళీధర్ గౌడ్ తదితరులు

దర్శకుడు: మల్లిక్ రామ్

నిర్మాతలు: సూర్యదేవర నాగవంశీ & సాయి సౌజన్య

సంగీత దర్శకులు: రామ్ మిరియాల, అచ్చు రాజమణి, భీమ్స్ సిసిరోలియో

సినిమాటోగ్రాఫర్‌: సాయి ప్రకాష్ ఉమ్మడిసింగు

ఎడిటింగ్: నవీన్ నూలి

సంబంధిత లింక్స్: ట్రైలర్

టాలీవుడ్ యూత్ ఫుల్ క్రేజీ హిట్ చిత్రాల్లో స్టార్ బాయ్ సిద్ధూ జొన్నలగడ్డ హీరోగా నటించిన చిత్రం “డీజే టిల్లు” కూడా ఒకటి. మరి ఈ చిత్రానికి క్రేజీ సీక్వెల్ లా వచ్చిన అవైటెడ్ చిత్రమే “టిల్లు స్క్వేర్”. దర్శకుడు మల్లిక్ రామ్ తెరకెక్కించిన ఈ చిత్రంలో అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్ గా నటించింది. ఇక ఈ సినిమా అంచనాలు అందుకుందో లేదో సమీక్షలో చూద్దాం..

కథ :

ఇక కథలోకి వస్తే పాత దెబ్బ నుంచి కోలుకుని టిల్లు(సిద్ధు జొన్నలగడ్డ) తన ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ తో కలిసి టిల్లు ఈవెంట్స్ స్టార్ట్ చేసి వెడ్డింగ్ ప్లానింగ్ లు తన డీజే ఈవెంట్స్ చేస్తుంటాడు. అలా ఓ రోజు తన లైఫ్ లోకి లిల్లీ జోసెఫ్(అనుపమ పరమేశ్వరన్) ఎంటర్ అవుతుంది. మరి అక్కడ నుంచి మళ్లీ టిల్లు గేర్ మారుస్తాడు. ఆ తర్వాత మళ్లీ తన బర్త్ డే స్పెషల్ గా ఫ్రెష్ ప్రాబ్లమ్ తో లిల్లీ తనని సాయం కోరుతుంది. మరి ఆల్రెడీ రాధికా వల్ల దెబ్బ తిన్న తాను ఏం చేస్తాడు? వీళ్ళ కథలోకి పేరు మోసిన మాఫియా డాన్ మెహబూబ్ అలీ(మురళీ శర్మ) కి లింక్ ఏంటి? మళ్లీ రాధికా(నేహా శెట్టి) ఉందా లేదా అసలు చివరికి ఈ క్రేజీ రైడ్ ఎలా ఎండ్ అయ్యింది అనేది తెలియాలి అంటే ఈ చిత్రాన్ని వెండితెరపై చూడాల్సిందే.

ప్లస్ పాయింట్స్ :

గత సినిమా సెన్సేషనల్ హిట్ కావడంతో దీనిపై మంచి అంచనాలు ఉన్నాయి. మెయిన్ గా ఎంటర్టైనింగ్ పరంగా టిల్లు స్క్వేర్ వాటిని అందుకుంటుంది అని చెప్పవచ్చు. సినిమా టైటిల్ కార్డ్స్ నుంచే మళ్లీ టిల్లు వైబ్స్ ని గుర్తు చేస్తూ సాలిడ్ ఎంటర్టైన్మెంట్ తో సినిమా సాగుతుంది.

ఇక స్టార్ బాయ్ సిద్ధూ జొన్నలగడ్డ మరోసారి డీజే టిల్లు గా షైన్ అయ్యాడు. తన మార్క్ టైమింగ్ కామెడీతో సీన్స్ ని హిలేరియోస్ గా పండించాడు అని చెప్పాలి. కొన్ని సీన్స్ లో మంచి హ్యాండ్సమ్ లుక్స్ తో మంచి నటనతో తాను ఈ సినిమాలో ఎంటర్టైన్ చేస్తాడు.

ఇక రాధికకి అప్డేటెడ్ వెర్షన్ లేక తనకి అక్క అంటూ సినిమాలో చూపించిన రేంజ్ లోనే అనుపమ సాలిడ్ రోల్ చేసింది. తన గ్లామ్ షో ఒకెత్తు అయితే తన పెర్ఫామెన్స్ కూడా సినిమాలో అదరగొడుతుంది. అలాగే ఇద్దరి మధ్య కెమిస్ట్రీ కానీ పలు కామెడీ సీన్స్ తో యూత్ కి ఈ సినిమాలో మంచి ఎంటర్టైన్మెంట్ కోరుకునేవారికి ట్రీట్ ఇస్తారు.

ఇక వీటితో పాటుగా సెకండాఫ్ లో ఓ సర్ప్రైజ్ కూడా మామూలుగా ఉండదు. ఇంకా మెయిన్ లీడ్ సహా మురళీ శర్మ తన రోల్ కి న్యాయం చేకూర్చారు ఇంకా నటుడు మురళీధర్ గౌడ్ నటన ఆయన కామెడీ టైమింగ్ ఆకట్టుకుంటాయి. ఇక వీరితో పాటుగా మిగతా తారాగణం అంతా తమ పాత్రలకు పూర్తి న్యాయం చేసారు.

మైనస్ పాయింట్స్ :

ఈ చిత్రంలో డెఫినెట్ గా మంచి ఎంటర్టైన్మెంట్ ఉంది కానీ కాన్సెప్ట్ మాత్రం రొటీన్ గానే ఉందని చెప్పాలి. గత పార్ట్ 1 లానే ఇది కూడా రొటీన్ లైన్ తోనే కొనసాగుతుంది. అలాగే కొన్ని సీన్స్ ఊహాజనీతం గానే అనిపిస్తాయి. ఇంకా కొన్ని కీలక ట్విస్ట్ లు మరీ అంత ఎగ్జైట్ చెయ్యవు.

అలాగే క్లైమాక్స్ పోర్షన్ కూడా ఒకింత రొటీన్ గానే అనిపిస్తుంది. ఇవి పక్కన పెడితే ఒక టైం లో అనుపమ రోల్ పై ట్విస్ట్ అందరికీ రుచించకపోవచ్చు. అలాగే సెకండాఫ్ లో మురళీ శర్మ పై కొన్ని ఎపిసోడ్స్ లో లాజిక్స్ సహా కొన్ని అంశాలు వీక్ గా అనిపిస్తాయి.

సాంకేతిక వర్గం :

ఈ సినిమాలో నిర్మాణ విలువలు బాగున్నాయి. మేకర్స్ అయితే ఎక్కడా కాంప్రమైజ్ అయినట్టు అనిపించదు. అలాగే టెక్నికల్ టీం లో రామ్ మిర్యాల, అచ్చు సాంగ్స్ భీమ్స్ నేపథ్య గీతంలు బాగా ప్లస్ అయ్యాయి. అలాగే సాయి ప్రకాష్ సినిమాటోగ్రఫీ మంచి కలర్ ఫుల్ గా బ్యూటిఫుల్ విజువల్స్ తో ఆకట్టుకునేలా ఉంది. నవీన్ నూలి ఎడిటింగ్ కూడా బాగుంది.

ఇక దర్శకుడు మల్లిక్ రామ్ విషయానికి వస్తే తను ఈ సినిమాకి ఇంప్రెసివ్ వర్క్ అందించాడు అని చెప్పాలి. తనతో పాటుగా సిద్ధూ కూడా ఈ చిత్రానికి రచనలో తన పనితనం చూపించాడు. నరేషన్ ని మల్లిక్ అయితే ఎక్కడా బోర్ కొట్టకుండా తీసుకెళ్లడం బాగుంది. స్టోరీ పరంగా కొన్ని అంశాలు రొటీన్ గానే ఉన్నాయి కానీ కావాల్సిన ఎంటర్టైన్మెంట్ మాత్రం తాను పుష్కలంగా అందించాడు.

తీర్పు :

ఇక మొత్తంగా చూసినట్టు అయితే డీజే టిల్లు కి సీక్వెల్ గా వచ్చిన ఈ క్రేజీ రైడ్ “టిల్లు స్క్వేర్” ఎంటర్టైన్మెంట్ ఇవ్వడంలో మాత్రం డిజప్పాయింట్ చెయ్యదు అని చెప్పాలి. సిద్ధూ, అనుపమ లు మెయిన్ లీడ్ లో అదరగొట్టేశారు. మంచి కామెడీ డీసెంట్ నరేషన్ సినిమాలో ఆడియెన్స్ ని ఎంగేజ్ చేస్తాయి. కాకపోతే కొన్ని సీన్స్ రొటీన్ గానే ఉన్నాయి ఇవి పక్కన పెడితే మరోసారి టిల్లు గాడు మంచి క్రేజీ రైడ్ తో కూడిన ఎంటర్టైన్మెంట్ ని థియేటర్స్ లో అందిస్తాడు.

123telugu.com Rating: 3.25/5

Reviewed by 123telugu Team

Click Here For English Review

REVIEW OVERVIEW
Tillu Square Movie Review in Telugu
tillu-square-movie-review-in-telugu విడుదల తేదీ : మార్చి 29, 2024 123తెలుగు.కామ్ రేటింగ్ : 3.25/5 నటీనటులు: సిద్ధూ జొన్నలగడ్డ, అనుపమ పరమేశ్వరన్, మురళీ శర్మ, ప్రిన్స్, బ్రహ్మాజీ, మురళీధర్ గౌడ్ తదితరులు దర్శకుడు: మల్లిక్ రామ్ నిర్మాతలు: సూర్యదేవర నాగవంశీ & సాయి సౌజన్య సంగీత దర్శకులు: రామ్ మిరియాల, అచ్చు రాజమణి, భీమ్స్ సిసిరోలియో సినిమాటోగ్రాఫర్‌: సాయి ప్రకాష్ ఉమ్మడిసింగు ఎడిటింగ్: నవీన్ నూలి సంబంధిత లింక్స్: ట్రైలర్ టాలీవుడ్ యూత్ ఫుల్ క్రేజీ...
Exit mobile version