ప్రస్తుతం టాలీవుడ్ అందుకున్న మరో హిట్ చిత్రం “టిల్లు స్క్వేర్” అని చెప్పాలి. యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో సిద్ధూ జొన్నలగడ్డ హీరోగా దర్శకుడు మల్లిక్ రామ్ కాంబినేషన్ లో చేసిన ఈ మొదటి సినిమా నిన్న థియేటర్స్ లోకి రాగా సూపర్ హిట్ టాక్ ని సొంతం చేసుకుంది. దీనితో ఓపెనింగ్స్ కూడా గట్టిగానే ఉంటాయని అంతా అనుకున్నారు. మరి మరో పక్క టిల్లు స్క్వేర్ ఓటిటి డీల్ కి సంబంధించి లేటెస్ట్ బజ్ తెలిసింది.
ఈ సినిమా స్ట్రీమింగ్ హక్కులని దిగ్గజ సంస్థ నెట్ ఫ్లిక్స్ వారు సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. మరి వారు ఈ చిత్రానికి సుమారు 13 నుంచి 15 కోట్ల మంచి డీల్ ఇచ్చి సొంతం చేసుకున్నట్టుగా టాక్. దీనితో కేవలం ఓటిటి హక్కులతోనే టిల్లు మంచి నెంబర్ రాబట్టేసాడు అని చెప్పాలి. ఇక బాక్సాఫీస్ వసూళ్ల పరంగా కూడా మేకర్స్ భారీ వసూళ్ళనే ఈ చిత్రం అందుకుంటుంది అని ధీమా వ్యక్తం చేస్తున్నారు. మరి చూడాలి ఈసారి టిల్లు ర్యాంపేజ్ ఎలా ఉంటుందో అనేది.