మ్యాసివ్ అప్ డేట్ కి రెడీ అయిన ‘టిల్లు స్క్వేర్’

మ్యాసివ్ అప్ డేట్ కి రెడీ అయిన ‘టిల్లు స్క్వేర్’

Published on Oct 26, 2023 11:36 PM IST

యువ నటుడు సిద్దు జొన్నలగడ్డ హీరోగా అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్ గా మల్లిక్ రామ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న యాక్షన్ కామెడీ ఎంటర్టైనర్ మూవీ టిల్లు స్క్వేర్. సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చూన్ ఫోర్ సినిమాస్ సంస్థల పై ప్రతిష్టాత్మకంగా నిర్మితం అవుతున్న ఈ మూవీ, గతేడాది రిలీజ్ అయి బాక్సాఫీస్ వద్ద పెద్ద సక్సెస్ సొంతం చేసుకున్న డీజే టిల్లు కి సీక్వెల్ గా తెరకెక్కుతోంది.

అయితే ఇటీవల షూటింగ్ మొత్తం పూర్తి చేసుకున్న ఈమూవీ ఈపాటికి రిలీజ్ కావాల్సి ఉన్నప్పటికీ కొంత పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ పెండింగ్ కారణంగా రిలీజ్ వాయిదా పడింది. ఇటీవల టిల్లు స్క్వేర్ నుండి రిలీజ్ అయిన ఫస్ట్ సాంగ్ అందరినీ ఆకట్టుకోగా రేపు ఉదయం 11 గం. 7 ని. లకు ఈ మూవీ నుండి ఒక మ్యాజివ్ అప్ డేట్ ని అందించనున్నట్లు మేకర్స్ కొద్దిసేపటి క్రితం ప్రకటించారు. రామ్ మిరియాల సంగీతం అందిస్తున్న ఈ మూవీ రిలీజ్ డేట్ ని త్వరలో అధికారికంగా అనౌన్స్ చేయనున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు