“టిల్లు స్క్వేర్” నుండి త్వరలో సెకండ్ సింగిల్!

“టిల్లు స్క్వేర్” నుండి త్వరలో సెకండ్ సింగిల్!

Published on Nov 12, 2023 8:59 PM IST


టాలీవుడ్ యంగ్ హీరో సిద్దు జొన్నలగడ్డ ప్రధాన పాత్రలో, డైరెక్టర్ మల్లిక్ రామ్ దర్శకత్వం లో తెరకెక్కుతున్న కామెడీ ఎంటర్టైనర్ టిల్లు స్క్వేర్. ఈ చిత్రం 2022 లో వచ్చిన డీజే టిల్లు కి సీక్వెల్. సితార ఎంటర్ టైన్మెంట్స్ మరియు ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ పతాకాల పై సూర్య దేవర నాగ వంశీ నిర్మిస్తున్న ఈ చిత్రానికి రామ్ మిరియాల, అచ్చు రాజమణి సంగీతం అందిస్తున్నారు. ఈ చిత్రం కి సంబందించిన ప్రచార చిత్రాలు రిలీజై ప్రేక్షకులను, అభిమానులని విశేషం గా ఆకట్టుకున్నాయి. ఫస్ట్ సింగిల్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది.

అయితే నేడు దీపావళి పండుగ సందర్భంగా మేకర్స్ సరికొత్త పోస్టర్ ను విడుదల చేసారు. పోస్టర్ చాలా బాగుంది. సెకండ్ సింగిల్ ను త్వరలోనే రిలీజ్ చేయనున్నట్లు మేకర్స్ వెల్లడించారు. ఫిబ్రవరి 9, 2024 లో థియేటర్ల లో గ్రాండ్ గా రిలీజ్ కానున్న ఈ సినిమా పై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు