టాలీవుడ్ స్టార్ హీరో, నందమూరి బాలకృష్ణ ప్రధాన పాత్రలో, స్టార్ డైరెక్టర్ అనిల్ రావిపూడి దర్శకత్వం లో తెరకెక్కుతున్న మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ భగవంత్ కేసరి. ఈ చిత్రం లో కాజల్ అగర్వాల్, శ్రీ లీల లేడీ లీడ్ రోల్స్ లో నటిస్తున్నారు. ఈ చిత్రం నుండి రిలీజైన ప్రచార చిత్రాలకి ఇప్పటికే ప్రేక్షకుల నుండి, అభిమానుల నుండి మంచి రెస్పాన్స్ వచ్చింది.
ఈ చిత్రం నుండి గణేష్ అంథెం ప్రోమో ను మేకర్స్ రిలీజ్ చేయగా, సూపర్ రెస్పాన్స్ వచ్చింది. పూర్తి పాటను సెప్టెంబర్ 1, 2023 న రిలీజ్ చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించిన సంగతి అందరికి తెలిసిందే. రేపు సాయంత్రం 5:06 గంటలకి ఈ పాటను రిలీజ్ చేయనున్నట్లు తాజాగా వెల్లడించారు. మ్యూజికల్ సెన్సేషన్ థమన్ ఈ సినిమాకి సంగీతం అందిస్తున్నారు. ఈ చిత్రం పై ప్రేక్షకుల్లో, అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. అక్టోబర్ 19, 2023 న థియేటర్ల లో గ్రాండ్ రిలీజ్ కానుంది.