ఆన్లైన్ లో మహేష్ మాస్ స్ట్రైక్ కి టైం ఫిక్స్.!

ఆన్లైన్ లో మహేష్ మాస్ స్ట్రైక్ కి టైం ఫిక్స్.!

Published on May 31, 2023 11:01 AM IST


ప్రస్తుతం టాలీవుడ్ లో మోస్ట్ అవైటెడ్ గా ఉన్న క్రేజీ ట్రీట్ ఏదన్నా ఉంది అంటే అది సూపర్ స్టార్ మహేష్ బాబు నటిస్తున్న తన 28వ సినిమాలో మాస్ స్ట్రైక్ కోసమే అని చెప్పాలి. దర్శకుడు త్రివిక్రమ్ తో మహేష్ చేస్తున్న హ్యాట్రిక్ సినిమా ఇది కావడం పైగా ఇదొక సూపర్ మాస్ ఎంటర్టైనర్ గా వస్తుండగా దీనిపై మరింత హైప్ అయితే నెలకొంది.

ఇక ఈరోజు సూపర్ స్టార్ కృష్ణ గారి జయంతి పురస్కరించుకొని “మోసగాళ్లకు మోసగాడు” చిత్రంతో అయితే అటాచ్ చేసి ఈరోజు సాయంత్రం థియేటర్స్ లో 6 గంటల 3 నిమిషాలకి రిలీజ్ చేస్తున్నట్టుగా ముందు కన్ఫర్మ్ చేసిన సంగతి తెలిసిందే. ఇక ఇప్పుడు అయితే దీనితో పాటుగా మహేష్ మాస్ స్ట్రైక్ ఆన్లైన్ వెర్షన్ పై కూడా మేకర్స్ క్లారిటీ ఇచ్చేసారు.

ఇక ఇదైతే థియేటర్స్ లో వచ్చిన మరో అరగంట తర్వాత అలా 6 గంటల 39 నిమిషాలకి అయితే రిలీజ్ చేస్తున్నట్టుగా తెలిపారు. మరి ఈ గ్లింప్స్ కి అయితే మహేష్ ఫ్యాన్స్ భారీ టార్గెట్స్ పెట్టుకున్నారు. ఆ సెన్సేషనల్ రీచ్ ని ఈ వీడియో అందుకుంటుందేమో చూడాలి. ఇక ఈ చిత్రాన్ని హారికా హాసిని వారు నిర్మాణం వహిస్తుండగా వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా ఈ చిత్రం రాబోతుంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు