“రామారావు ఆన్ డ్యూటీ” ట్రైలర్ రిలీజ్ కి టైం ఖరారు.!

“రామారావు ఆన్ డ్యూటీ” ట్రైలర్ రిలీజ్ కి టైం ఖరారు.!

Published on Jul 16, 2022 12:00 PM IST

మాస్ మహారాజ రవితేజ హీరోగా మజిలీ ఫేమ్ దివ్యాన్షా కౌశిక్ హీరోయిన్ గా దర్శకుడు శరత్ మండవ తెరకెక్కించిన లేటెస్ట్ సాలిడ్ యాక్షన్ డ్రామా “రామారావు ఆన్ డ్యూటీ”. మంచి అంచనాలు నెలకొల్పుకున్న ఈ చిత్రాన్ని మేకర్స్ మంచి ప్రమోషన్స్ నడుమ ప్రెజెంట్ చేస్తుండగా ఈ సినిమా నుంచి మోస్ట్ అవైటెడ్ ట్రైలర్ కోసం సన్నాహాలు సిద్ధం చేశారు.

మరి ఈరోజు గ్రాండ్ ఈవెంట్ తో ఈ ట్రైలర్ ని రిలీజ్ కి ప్లాన్ చేస్తుండగా ఇప్పుడు ఈ ట్రైలర్ రిలీజ్ కి టైం ని అయితే అనౌన్స్ చేశారు. మరి ఈరోజు ఈ చిత్రం ట్రైలర్ ని రాత్రి 8 గంటల 1 నిమిషానికి రిలీజ్ చేస్తున్నట్టు తెలిపారు. ఇక ఈ చిత్రానికి సామ్ సి ఎస్ సంగీతం అందించగా ఎస్ ఎల్ వి సినిమాస్ మరియు రవితేజ సంయుక్తంగా నిర్మాణం వహించారు. అలాగే ఈ జూలై 29న ఈ చిత్రం గ్రాండ్ గా రిలీస్ కాబోతుంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు