టీజర్ విడుదల కి రెడీ అయిన శ్రీవిష్ణు “స్వాగ్”

టీజర్ విడుదల కి రెడీ అయిన శ్రీవిష్ణు “స్వాగ్”

Published on Jun 14, 2024 3:01 AM IST

టాలీవుడ్ యంగ్ హీరో శ్రీవిష్ణు చివరిసారిగా ఓం భీమ్ బుష్ అనే హిట్ చిత్రంలో కనిపించారు. తదుపరి స్వాగ్ చిత్రంలో కనిపించనున్నారు. ఈ క్రేజీ ప్రాజెక్ట్ కి హసిత్ గోలి దర్శకత్వం వహిస్తుండగా, రీతూ వర్మ హీరోయిన్ గా నటిస్తుంది. ఈ చిత్రం ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ తో వార్తల్లో నిలుస్తూనే ఉంది. తాజాగా మేకర్స్ మరొక ఇంట్రెస్టింగ్ పోస్ట్ తో ఆడియెన్స్ ముందుకు వచ్చారు. సినిమాకి సంబందించిన టీజర్ ను రేపు ఉదయం 11:05 గంటలకి రిలీజ్ చేయనున్నారు. ఇదే విషయాన్ని సరికొత్త పోస్టర్ ద్వారా వెల్లడించారు మేకర్స్.

యంగ్ బ్యూటీ దక్షా నగార్కర్, మీరా జాస్మిన్, శరణ్య ప్రదీప్ లు కీలక పాత్రల్లో కనిపించనున్నారు. ఈ చిత్రానికి వివేక్ సాగర్ సంగీతం అందిస్తుండగా, పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ పై టీజీ విశ్వ ప్రసాద్ నిర్మిస్తున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు