నిఖిల్ సిద్ధార్థ్ “18పేజెస్” నుండి టైమ్ ఇవ్వు పిల్లా సాంగ్ రిలీజ్!

నిఖిల్ సిద్ధార్థ్ “18పేజెస్” నుండి టైమ్ ఇవ్వు పిల్లా సాంగ్ రిలీజ్!

Published on Dec 5, 2022 6:17 PM IST

టాలీవుడ్ యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో నిఖిల్ సిద్ధార్థ్ కార్తికేయ 2 చిత్రం బ్లాక్ బస్టర్ సక్సెస్ తో దూసుకు పోతున్నాడు. ఈ హీరో నటిస్తున్న లేటెస్ట్ మూవీ 18 పేజెస్. పల్నాటి సూర్య ప్రతాప్ దర్శకత్వం లో తెరకెక్కుతున్న ఈ రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్ లో అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్ గా నటిస్తుంది. ఈ చిత్రం నుండి తాజాగా టైమ్ ఇవ్వు పిల్లా అనే సాంగ్ ని చిత్ర యూనిట్ విడుదల చేయడం జరిగింది. ప్రతీ ఒక్కరి లైఫ్ లో ప్రేమించడం ఎంత కామనో , బ్రేకప్ కూడా అంతే కామన్. అలా బ్రేకప్ అయినా కుర్రాడు పాడే పాటే టైం ఇవ్వు పిల్ల కొంచెం టైం ఇవ్వు, శ్రీమణి రచించిన ఈ పాటను
శింబు ఆలపించారు.

మేకర్స్ ఇటీవల టైం ఇవ్వు పిల్ల కొంచెం అనే పాట హుక్ స్టెప్ ప్రోమోను రిలీజ్ చేసారు. గ్రాండ్ విజువల్స్ తో యూత్ కి కనెక్ట్ అయ్యే విధంగా ఈ పాట ఉండబోతుంది. గోపి సుందర్ సంగీతం అందిస్తున్న ఈ పాటకి శ్రీమణి లిరిక్స్ రాయగా, కోలీవుడ్ స్టార్ హీరో శింబు పాడటం జరిగింది. ఈ పాట రిలీజైన కొద్ది సేపటికే విశేషం గా ఆకట్టుకుంటుంది. ఇదివరకే ఎన్టీఆర్ బాద్ షా కి డైమెండ్ గర్ల్ మంచు మనోజ్ పోటుగాడికి కి బుజ్జి పిల్ల యంగ్ హీరో రామ్ పోతినేని వారియర్ కి బుల్లెట్ సాంగ్ ను పడిన శింబు ఇప్పుడు నిఖిల్ నటిస్తున్న 18పేజిస్ కోసం టైం ఇవ్వు పిల్ల టైం ఇవ్వు అనే పాటను పాడాడు. వాటి మాదిరిగానే ఈ పాట కూడా పెద్ద హిట్ అవ్వబోతుందని అర్ధమవుతుంది.

సుకుమార్ స్టోరీ అందించిన ఈ చిత్రాన్ని జీఏ2 పిక్చర్స్ మరియు సుకుమార్ రైటింగ్ ల పై బన్నీ వాసు నిర్మిస్తున్నారు. డిసెంబర్ 23, 2022 న వరల్డ్ వైడ్ గా థియేటర్ల లో విడుదల కాబోతున్న ఈ చిత్రం పై సర్వత్రా ఆసక్తి నెలకొంది.

పాట కోసం ఇక్కడ క్లిక్ చేయండి

సంబంధిత సమాచారం

తాజా వార్తలు