అఖిల్ నెక్స్ట్ టైటిల్ గ్లింప్స్ కి టైం లాక్!

అఖిల్ నెక్స్ట్ టైటిల్ గ్లింప్స్ కి టైం లాక్!

Published on Apr 8, 2025 10:03 AM IST

అక్కినేని యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో అఖిల్ అక్కినేని హీరోగా నటిస్తున్న లేటెస్ట్ అవైటెడ్ సినిమా కోసం అందరికీ తెలిసిందే. తన కెరీర్ 6వ సినిమాగా తెరకెక్కిస్తున్న ఈ చిత్రం కోసం అక్కినేని అభిమానులు చాలా ఎగ్జైటెడ్ గా ఎదురు చూస్తున్నారు. నేడు అఖిల్ పుట్టినరోజు కావడంతో మేకర్స్ కూడా సాలిడ్ అప్డేట్ ని నేడు అఖిల్ పుట్టినరోజు కానుకగా అనౌన్స్ చేస్తున్నట్టుగా తెలిపారు.

ఇక ఫైనల్ గా ఆ రోజు రానే వచ్చింది. మరి ఈ అవైటెడ్ టైటిల్ గ్లింప్స్ కి ఇపుడు మేకర్స్ డేట్ టైం ని లాక్ చేసేసారు. దీనితో ఈ సాయంత్రం 4 గంటల 5 నిమిషాలకి అఖిల్ 6వ సినిమా టైటిల్ గ్లింప్స్ ని విడుదల చేయనున్నట్టుగా తెలిపారు. ఇక ఈ చిత్రానికి కిషోర్ అబ్బూరు దర్శకత్వం వహిస్తుండగా దీనిపై కూడా సాలిడ్ హైప్ నెలకొంది. ఇక ఈ చిత్రానికి సితార ఎంటర్టైన్మెంట్స్ అలాగే అన్నపూర్ణ స్టూడియోస్ వారు నిర్మాణం వహిస్తున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు