అల్లరి నరేష్ పక్కా మాస్ సినిమా గ్లింప్స్ కి టైం ఫిక్స్

మన టాలీవుడ్ టాలెంటెడ్ హీరో అల్లరి నరేష్ నటించిన చిత్రాలు ఈ ఏడాదిలో ఆల్రెడీ రెండు వచ్చాయి. మరి కింగ్ నాగార్జునతో చేసిన “నా సామిరంగ” లో తన కీలక పాత్ర మంచి గుర్తింపు తెచ్చుకోగా దీని తర్వాత చేసిన ఎంటర్టైనర్ “ఆ ఒక్కటీ అడక్కు” పర్వాలేదనిపించింది. అయితే అల్లరి నరేష్ నుంచి కొన్ని సాఫ్ట్ పాత్రలతో పాటుగా మంచి హార్డ్ హిట్టింగ్ రోల్స్ కూడా పడ్డాయి. మరి వీటికి పీక్ రోల్ అన్నట్టుగా తాను చేసిన పక్కా మాస్ చిత్రమే “బచ్చల మల్లి”.

దర్శకుడు సుబ్బు మంగదెవ్వి ఈ చిత్రాన్ని కొని నిజ జీవిత సంఘటనలు ఆధారంగా తెరకెక్కించగా ఫస్ట్ లుక్ పోస్టర్ తోనే సాలిడ్ రెస్పాన్స్ దీనికి వచ్చింది. ఇక ఇప్పుడు ఈ సినిమా పై అల్లరి నరేష్ బర్త్ డే గ్లింప్స్ అప్డేట్ ఇస్తూ వదిలిన పోస్టర్ కూడా చాలా నాచురల్ గా అల్లరి నరేష్ నాటు లుక్ లో అదరగొట్టేసాడని చెప్పాలి. ఇక ఈ టీజర్ గ్లింప్స్ అయితే రేపు జూన్ 30న రిలీజ్ చేస్తున్నట్టుగా దీనితో అనౌన్స్ చేశారు. మరి ఈ టీజర్ ఎలా ఉంటుందో చూడాలి.

Exit mobile version