‘జనక అయితే గనక’ రిలీజ్ ట్రైలర్‌కి టైమ్ ఫిక్స్!

ట్యాలెంటెడ్ యాక్టర్ సుహాస్ నటిస్తున్న తాజా చిత్రం ‘జనక అయితే గనక’ ప్రేక్షకుల్లో మంచి బజ్‌ని క్రియేట్ చేసింది. ఈ సినిమా పూర్తి ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కించారు చిత్ర యూనిట్. ఈ సినిమా నుండి ఇప్పటివరకు రిలీజ్ అయిన కంటెంట్ ప్రేక్షకులను మెప్పించడంతో ఈ సినిమాపై పాజిటివ్ వైబ్స్ క్రియేట్ అయ్యాయి.

ఇక ఈ సినిమా నుంచి ఇప్పుడు రిలీజ్ ట్రైలర్‌ని కూడా రిలీజ్ చేసేందుకు మేకర్స్ రెడీ అయ్యారు. దసరా కానుకగా ఈ సినిమాను అక్టోబర్ 12న గ్రాండ్ రిలీజ్‌కు సిద్ధం చేయడంతో, ఈ రిలీజ్ ట్రైలర్‌ను అక్టోబర్ 9న ఉదయం 10 గంటలకు రిలీజ్ చేస్తున్నట్లు మేకర్స్ అనౌన్స్ చేశారు. ఈ రిలీజ్ ట్రైలర్ ఆద్యంతం ఆకట్టుకునే విధంగా.. సినిమాపై మరింత ఇంట్రెస్ట్‌ను క్రియేట్ చేసేలా ఉండనుందని చిత్ర యూనిట్ తెలిపింది.

ఈ సినిమాలో సంగీర్తన విపిన్ హీరోయిన్‌గా నటిస్తోంది. గోపరాజు రమణ, వెన్నెల కిషోర్, రాజేంద్ర ప్రసాద్ తదితరులు ఈ సినిమాలో ఇతర ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. సందీప్ రెడ్డి బండ్ల డైరెక్ట్ చేసిన ఈ సినిమాను దిల్ రాజు ప్రొడక్షన్స్ బ్యానర్‌పై హర్షిత్ రెడ్డి, హన్షితా రెడ్డి ప్రొడ్యూస్ చేశారు. విజయ్ బుల్గనిన్ ఈ చిత్రానికి సంగీతం అందించారు.

Exit mobile version