‘క’ జాతర సాంగ్‌కి ముహూర్తం ఫిక్స్!

యంగ్ హీరో కిరణ్ అబ్బవరం నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘క’ షూటింగ్ పనులు ముగించుకుని పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉంది. ఈ సినిమాను పాన్ ఇండియా మూవీగా చిత్ర యూనిట్ తెరకెక్కిస్తుండగా, ఇందులో కిరణ్ అబ్బవరం ఓ సరికొత్త పాత్రలో నటిస్తున్నాడు. ఇక ఈ సినిమా నుంచి ఇప్పటికే రిలీజ్ అయిన పోస్టర్స్, టీజర్, సాంగ్స్ ప్రేక్షకులను ఇంప్రెస్ చేశాయి.

కాగా, ఇప్పుడు ఈ సినిమా నుంచి మూడో సింగిల్ సాంగ్‌ను మేకర్స్ రిలీజ్ చేస్తున్నారు. ఈసారి జాతర మాస్ సాంగ్‌ను రిలీజ్ చేయబోతున్నట్లు చిత్ర యూనిట్ తెలిపింది. ఇక ఈ జాతర సాంగ్‌కి సంబంధించిన ప్రోమోని శనివారం ఉదయం 10.05 గంటలకు రిలీజ్ చేస్తున్నట్లు మేకర్స్ తెలిపారు. ఇక ఈ సాంగ్‌ని అక్టోబర్ 7న రిలీజ్ చేయబోతున్నట్లు తాజాగా ఓ పవర్‌ఫుల్ పోస్టర్ ద్వారా వెల్లడించారు.

ఈ సినిమాలో తాన్వీ రామ్, నయన్ సారిక, అచ్యుత్ కుమార్ తదితరులు ఇతర ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. ఈ సినిమాను సుజిత్-సందీప్ డైరెక్ట్ చేస్తుండగా సామ్ సీఎస్ సంగీతం అందిస్తున్నాడు.

Exit mobile version