‘క’ ట్రైలర్‌కి టైమ్ ఫిక్స్.. ఎప్పుడంటే?

‘క’ ట్రైలర్‌కి టైమ్ ఫిక్స్.. ఎప్పుడంటే?

Published on Oct 23, 2024 9:00 PM IST

యంగ్ హీరో కిరణ్ అబ్బవరం నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘క’ ఇప్పటికే ప్రేక్షకుల్లో మంచి బజ్‌ని క్రియేట్ చేసింది. ఈ సినిమాను సుజిత్, సందీప్ డైరెక్ట్ చేస్తుండా, కిరణ్ అబ్బవరం తన సొంత బ్యానర్‌పై ప్రొడ్యూస్ చేస్తున్నారు. ఇక ఈ సినిమా నుండి ఇప్పటికే రిలీజ్ అయిన పోస్టర్స్, టీజర్, సాంగ్స్‌కు ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ దక్కింది.

అయితే, ఇప్పుడు ఈ సినిమా థియేట్రికల్ ట్రైలర్‌ను రిలీజ్ చేసేందుకు మేకర్స్ సిద్ధమవుతున్నారు. ‘క’ చిత్రానికి సంబంధించిన ట్రైలర్‌ను అక్టోబర్ 24న సాయంత్రం 5.01 గంటలకు రిలీజ్ చేస్తున్నట్లు ఓ సరికొత్త పోస్టర్ ద్వారా వెల్లడించారు. దీంతో ఈ సినిమా ట్రైలర్ ఎలా ఉండబోతుందా అని ప్రేక్షకులు ఆసక్తిగా చూస్తున్నారు.

ఈ సినిమాలో తన్వీ రామ్, నయన్ సారిక హీరోయిన్లుగా నటిస్తున్నారు. సామ్ సిఎస్ సంగీతం అందిస్తున్న ‘క’ చిత్రాన్ని దీపావళి కానుకగా అక్టోబర్ 31న గ్రాండ్ రిలీజ్ చేస్తున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు