కళ్యాణ్ రామ్ “అర్జున్ సన్నాఫ్ వైజయంతి” టీజర్ కి టైం వచ్చేసింది!

నందమూరి టాలెంటెడ్ హీరో కళ్యాణ్ రామ్ హీరోగా ఇపుడు నటిస్తున్న లేటెస్ట్ చిత్రం “సన్నాఫ్ వైజయంతి” కోసం తెలిసిందే. దర్శకుడు ప్రదీప్ చిలుకూరి తెరకెక్కించిన సాలిడ్ మాస్ యాక్షన్ డ్రామా ఇది కాగా దీనిపై మంచి బజ్ కూడా ఉంది. రీసెంట్ గానే మేకర్స్ ఈ చిత్రం నుంచి ప్రీ టీజర్ ఆ తర్వాత టీజర్ ని కూడా అనౌన్స్ చేసిన సంగతి తెలిసిందే. ఇక లేటెస్ట్ గా ఈ టీజర్ తాలూకా టైం ని అనౌన్స్ చేసేసారు.

మార్చ్ 17న ఉదయం 9 గంటల నుంచే హైదరాబాద్ ట్రిపుల్ ఏ సినిమాస్ లో టీజర్ లాంచ్ ని ప్లాన్ చేస్తున్నట్టుగా కన్ఫర్మ్ చేయగా అక్కడ నుంచి ఆన్లైన్ లో మాత్రం రేపు ఉదయం 10 గంటల 32 నిమిషాలకి రిలీజ్ చేస్తున్నట్టుగా ప్రకటించారు. మరి ఈ టీజర్ ఎలా ఉంటుందో వేచి చూడాలి. ఇక ఈ చిత్రానికి అజనీష్ లోకనాథ్ సంగీతం అందిస్తుండగా ఎన్టీఆర్ ఆర్ట్స్ సహా అశోక క్రియేషన్స్ వారు సంయుక్తంగా నిర్మాణం వహిస్తున్నారు. అలాగే ఈ చిత్రంలో కళ్యాణ్ రామ్ సరసన సాయి మంజ్రేకర్ హీరోయిన్ గా నటిస్తుంది.

Exit mobile version