కార్తీ “జపాన్” ట్రైలర్ రిలీజ్ కి టైం ఫిక్స్..!

కార్తీ “జపాన్” ట్రైలర్ రిలీజ్ కి టైం ఫిక్స్..!

Published on Oct 28, 2023 12:00 PM IST

కోలీవుడ్ టాలెంటెడ్ హీరో కార్తీ హీరోగా అను ఇమ్మాన్యుయేల్ హీరోయిన్ గా యంగ్ దర్శకుడు రాజు మురుగన్ తెరకెక్కిస్తున్న ఇంట్రెస్టింగ్ యాక్షన్ డ్రామా “జపాన్”. మరి లాస్ట్ టైం “సర్దార్” తో భిన్నమైన గెటప్స్ లో కనిపించి అదరగొట్టిన కార్తీ ఈసారి జపాన్ లో కూడా ఓ వైవిధ్యమైన పాత్రలో నటిస్తూ ఈసారి ఓ ఎంటర్టైనింగ్ డాన్ లా అయితే కనిపిస్తున్నాడు. మరి ఈ చిత్రం పట్ల తెలుగు ఆడియెన్స్ లో కూడా మంచి ఆసక్తి నెలకొంది.

ఇక ఈరోజు అయితే గ్రాండ్ గా తమిళనాట ఆడియో అండ్ ట్రైలర్ లాంచ్ కార్యక్రమం జరుగుతూ ఉండగా ఈ ఈవెంట్ తోనే రాత్రి 10 గంటలకి అయితే ట్రైలర్ ని రిలీజ్ చేస్తున్నట్టుగా మేకర్స్ కన్ఫర్మ్ చేశారు. సో కార్తీ ఫ్యాన్స్ అప్పటివరకు ఆగక తప్పదు అని చెప్పాలి. ఇక ఈ చిత్రానికి అయితే జివి ప్రకాష్ సంగీతం అందిస్తుండగా డ్రీం వారియర్ పిక్చర్స్ వారు ఈ చిత్రానికి నిర్మాణం వహిస్తున్నారు అలాగే ఈ దీపావళి కానుకగా అయితే ఈ చిత్రం ఈ నవంబర్ లో రిలీజ్ కాబోతుంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు