రవితేజ “మిస్టర్ బచ్చన్” షో రీల్ కి టైం ఫిక్స్

రవితేజ “మిస్టర్ బచ్చన్” షో రీల్ కి టైం ఫిక్స్

Published on Jun 16, 2024 1:58 PM IST

మాస్ మహారాజ్ రవితేజ హీరోగా భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్ గా దర్శకుడు హరీష్ శంకర్ తెరకెక్కిస్తున్న అవైటెడ్ మాస్ ఎంటర్టైనర్ చిత్రం “మిస్టర్ బచ్చన్” కోసం తెలిసిందే. మరి సాలిడ్ హైప్ ఉన్న ఈ చిత్రాన్ని మేకర్స్ శరవేగంగా కంప్లీట్ చేయగా మేకర్స్ నిన్ననే సినిమా నుంచి ఓ షో రీల్ ని రిలీజ్ చేస్తున్నట్టుగా ఈ జూన్ 17 డేట్ ని ఫిక్స్ చేశారు. అయితే ఇప్పుడు ఈ షో రీల్ తాలూకా టైం ని కూడా మేకర్స్ రివీల్ చేసేసారు.

దీనితో ఈ ట్రీట్ రేపు సాయంత్రం 4 గంటల 5 నిమిషాలకి వస్తున్నట్టుగా రివీల్ చేశారు. అయితే ఇది ఈ సినిమా టీజర్ గా ప్లాన్ చేసినట్టు తెలుస్తుంది. అంతే కాకుండా రిలీజ్ డేట్ పై కూడా ఓ క్లారిటీ వచ్చే ఛాన్స్ లు ఉన్నట్టుగా టాక్. మరి అదేంటో తెలియాలి అంటే రేపటి వరకు ఆగాల్సిందే. ఇక ఈ చిత్రానికి మిక్కీ జే మేయర్ సంగీతం అందిస్తుండగా పీపుల్ మీడియా ఫ్యాక్టరీ వారు నిర్మాణం వహిస్తున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు