టాలీవుడ్‌లో తెరకెక్కుతున్న ప్రెస్టీజియస్ చిత్రాల్లో ‘ఓదెల 2’ ఇప్పటికే ప్రేక్షకుల్లో మంచి బజ్ క్రియేట్ చేసింది. ఈ సినిమాను అశోక్ తేజ డైరెక్ట్ చేస్తుండగా దర్శకుడు సంపత్ నంది కథను అందిస్తూ ప్రొడ్యూస్ చేస్తున్నారు. ఇప్పటికే రిలీజ్ అయిన ఈ మూవీ ప్రమోషనల్ కంటెంట్ ఈ చిత్రంపై అంచనాలను అమాంతం పెంచేశాయి.
ఇక ఇప్పుడు ఈ సినిమా నుంచి మరో సాలిడ్ స్టఫ్ ఇచ్చేందుకు చిత్ర యూనిట్ రెడీ అయ్యింది. ఈ సినిమా ట్రైలర్‌ను ఏప్రిల్ 8న గ్రాండ్ రిలీజ్ చేస్తున్నట్లు వారు ప్రకటించారు. ఏప్రిల్ 8న సాయంత్రం 4.05 గంటలకు ఈ చిత్ర ట్రైలర్ రిలీజ్ చేస్తున్నట్లు మేకర్స్ వెల్లడించారు. ఈ ట్రైలర్ ఆద్యంతం పవర్‌ఫుల్ కట్‌గా రాబోతుందని చిత్ర వర్గాలు చెబుతున్నాయి.
ఈ సినిమాలో మిల్కీ బ్యూటీ తమన్నా, హెబ్బా పటేల్, వశిష్ట సింహ తదితరులు ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. అజనీష్ లోక్‌నాథ్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాను ఏప్రిల్ 17న గ్రాండ్ రిలీజ్ చేసేందుకు మేకర్స్ రెడీ అవుతున్నారు.