టాలీవుడ్ హీరో రాజ్ తరుణ్ గత కొంత కాలంగా సరైన హిట్ లేక సతమతమవుతున్నాడు. ఆయన నటించిన ప్రతి సినిమా బాక్సాఫీస్ దగ్గర ఫ్లాప్‌గా నిలవడంతో, ఓ సాలిడ్ హిట్ కోసం ఆయన ఎదురుచూస్తున్నాడు. 2024 లో రాజ్ తరుణ్ నటించిన పురుషోత్తముడు, తిరగబడరా సామీ, భలే ఉన్నాడే చిత్రాలు బాక్సాఫీస్ దగ్గర విజయాన్ని అందుకోలేకపోయాయి.
దీంతో ఇక తన నెక్స్ట్ మూవీతో ఎలాగైనా కమ్‌బ్యాక్ ఇవ్వాలని రాజ్ తరుణ్ ప్రయత్నిస్తున్నాడు. ఈ క్రమంలోనే తన నెక్స్ట్ మూవీగా ఓ క్రైమ్ కామెడీ ఎంటర్‌టైనర్ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు. రమేష్ కడుముల డైరెక్షన్‌లో తెరకెక్కుతున్న ఈ సినిమాకు సంబంధించి తాజాగా ఓ అప్డేట్ ఇచ్చారు మేకర్స్. ఈ సినిమా ఫస్ట్ లుక్‌తో పాటు టైటిల్‌ను న్యూ ఇయర్ కానుకగా జనవరి 1న మధ్యాహ్నం 3.33 గంటలకు రివీల్ చేయబోతున్నట్లు మేకర్స్ తెలిపారు.
ఈ సినిమాలో రాశి సింగ్ హీరోయిన్‌గా నటిస్తోంది. శేఖర్ చంద్ర సంగీతం అందిస్తున్న ఈ సినిమాను కనెక్ట్ మూవీస్ ఎల్ఎల్‌పి బ్యానర్ ప్రొడ్యూస్ చేస్తుంది.