గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘పెద్ది’ ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. ఈ సినిమాను దర్శకుడు బుచ్చిబాబు సానా తెరకెక్కిస్తుండటంతో ఈ మూవీపై అంచనాలు నెక్స్ట్ లెవెల్‌లో క్రియేట్ అయ్యాయి. ఇక ఈ సినిమాకు ఆస్కార్ విన్నర్ ఏఆర్.రెహమాన్ సంగీతం అందిస్తుండటంతో ఈ మూవీ బాక్సాఫీస్ దగ్గర ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేయనుందా అని అందరూ ఆసక్తిగా చూస్తున్నారు.
ఇటీవల ఈ మూవీ నుంచి టైటిల్, ఫస్ట్ లుక్ పోస్టర్స్ రివీల్ చేయగా, ప్రేక్షకుల నుంచి సాలిడ్ రెస్పాన్స్ దక్కింది. ఇక ఇప్పుడు ఈ సినిమా నుంచి మరో బిగ్ అప్డేట్ ఇవ్వనున్నారు. ‘పెద్ది’ చిత్రానికి సంబంధించిన రిలీజ్ డేట్ గ్లింప్స్ ‘పెద్ది ఫస్ట్‌షాట్’కు మేకర్స్ టైమ్ ఫిక్స్ చేశారు. శ్రీరామ నవమి పర్వదినం సందర్భంగా ఈ మూవీ రిలీజ్ డేట్ గ్లింప్స్‌ను ఏప్రిల్ 6న ఉదయం 11.45 గంటలకు రిలీజ్ చేయబోతున్నట్లు చిత్ర యూనిట్ తెలిపింది.
ఈ గ్లింప్స్‌కు సంబంధించిన మిక్సింగ్ కూడా పూర్తయ్యిందని.. ఇక ప్రేక్షకులు ఈ ట్రీట్‌ను ఆస్వాదించడమే తరువాయి అనే విధంగా బుచ్చిబాబు, ఏఆర్ రెహమాన్ కలిసి ఉన్న ఫోటోను మేకర్స్ తాజాగా సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఇక ఈ సినిమాలో శివ రాజ్‌కుమార్, జగపతి బాబు, జాన్వీ కపూర్ తదితరులు ఇతర ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు.
Mixing done ❤️????????
The Blockbuster director and the Maestro have cooked ????????#PeddiFirstShot – Release Date Glimpse out on 6th April on the occasion of Sri Rama Navami at 11.45 AM ✨Global Star @AlwaysRamCharan @NimmaShivanna #JanhviKapoor @BuchiBabuSana @arrahman @RathnaveluDop… pic.twitter.com/DDqsvdNcgQ
— Vriddhi Cinemas (@vriddhicinemas) April 4, 2025