RC16 మెగా ట్రీట్‌కు టైమ్ ఫిక్స్

RC16 మెగా ట్రీట్‌కు టైమ్ ఫిక్స్

Published on Mar 26, 2025 5:47 PM IST

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ RC16 అనే వర్కింగ్ టైటిల్‌తో తెరకెక్కుతోంది. ఈ సినిమాను దర్శకుడు బుచ్చిబాబు సానా డైరెక్ట్ చేస్తుండగా స్పోర్ట్స్ డ్రామాగా ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. ఇక ఈ సినిమా నుంచి సాలిడ్ అప్డేట్ అయితే మేకర్స్ తాజాగా ఇచ్చారు.

రామ్ చరణ్ బర్త్ డే సందర్భంగా RC16 ఫస్ట్ లుక్ పోస్టర్‌తో పాటు టైటిల్‌ను మార్చి 27న ఉదయం 9.09 గంటలకు అనౌన్స్ చేస్తున్నట్లు చిత్ర యూనిట్ తెలిపింది. ఈ మేరకు ఓ ప్రీ-లుక్ పోస్టర్ ద్వారా ఈ విషయాన్ని రివీల్ చేశారు. ఇక ఈ సినిమాలో రామ్ చరణ్ పాత్ర ఎంత రగడ్‌గా ఉండబోతుందో ప్రీ-లుక్ పోస్టర్ చూస్తే అర్థమవుతోంది.

దీంతో ఈ ఫస్ట్ లుక్ పోస్టర్ ఎలాంటి ఇంపాక్ట్ చేయబోతుందా అని మెగా ఫ్యాన్స్ ఆతృతగా ఎదురుచూస్తున్నారు. ఇక ఈ సినిమాలో అందాల భామ జాన్వీ కపూర్ హీరోయిన్‌గా నటిస్తుండగా కన్నడ స్టార్ హీరో శివ రాజ్‌కుమార్, జగపతి బాబు తదితరులు ఇతర ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. ఈ చిత్రానికి ఏఆర్.రెహమాన్ సంగీతం అందిస్తుండగా మైత్రీ మూవీ మేకర్స్, వృద్ధి సినిమాస్, సుకుమార్ రైటింగ్స్ బ్యానర్లు సంయుక్తంగా ప్రొడ్యూస్ చేస్తున్నాయి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు